KTR | వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.. త్వరలో సిరిసిల్ల, సిద్దిపేటలో సభలు పెట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల స్పందిస్తూ.. సిరిసిల్లకి వచ్చి రాజన్నను దర్శించుకుని పాపప్రాప్తి చేసుకోవాలని రేవంత్ రెడ్డిని సూచిస్తున్నానన్నారని తెలిసిందే. ఈ క్రమంలో సిరిసిల్లకు వస్తున్న రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రాన్ని నడిపించే ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్నామన్న విషయాన్ని కూడా మరిచిపోయి, మీరు పర్యటించిన ప్రతిచోట కేవలం బూతు పురాణాలతో బురదజల్లే సంస్కృతిని దయచేసి సిరిసిల్లలో కొనసాగించవద్దంటూ కేటీఆర్ తన లేఖలో కోరారు. అయితే సిరిసిల్లలో 8000 ఎకరాల ప్రభుత్వభూమిని BRS నాయకులు దోచుకున్నారని, అందులో నుండి 2400 ఎకరాలు మీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని మీరు అసెంబ్లీలో చేసిన నిరాధారమైన ఆరోపణలపై ఒక శ్వేతపత్రం విడుదల చేసిన తరువాతే సిరిసిల్లలో అడుగు పెట్టాలని లేఖలో డిమాండ్ చేశారు.
అసలు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో పంపిణీ చేసిన ప్రభుత్వ భూమి ఎంత..? అందులో నుంచి రికవరీ చేసినట్టుగా చెబుతున్న భూమి ఎంత..? అది ఏ మండలం, ఏ గ్రామం, ఏ సర్వే నంబర్, ఏ రైతుకు చెందినది.. ఎంత విస్తీర్ణం వంటి సమగ్ర వివరాలను బహిరంగంగా ప్రకటించాలని కోరుతున్నానంటూ సుదీర్ఘ అంశాలను సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.
సిరిసిల్లకు వెళ్తున్న రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🔹 8 వేల ఎకరాల భూములపై రేవంత్ చేసిన ఆరోపణలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి
🔹 2,400 ఎకరాలు రికవరీ చేసినట్లు చెబుతున్న వివరాలు బయటపెట్టాలి
🔹 నేతన్న, రైతన్న, విద్యార్థి, అన్ని… pic.twitter.com/8Q0A0Enfsw
— BRS Party (@BRSparty) September 27, 2026
Nivetha Pethuraj | సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. నివేదా పేతురాజ్ సంచలన విషయాలు
The Paradise | వీక్ డేస్‌లోను తగ్గని ‘ది ప్యారడైజ్’ జోరు.. మూడో రోజు కూడా భారీ బుకింగ్స్!