IND vs WI : తిరువనంతపురం వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్(107) శతకతో కదం తొక్కాడు. భారత బౌలర్లను సమర్దంగా ఎదుర్కొన్న గ్రీవ్స్.. జడేజా ఓవర్లో సింగిల్ తీసి మూడంకెల స్కోరందుకున్నాడు. వన్డేల్లో అతడికిది మొట్టమొదటి సెంచరీ కావడం విశేషం. టెస్టు్ల్లో ఇప్పటికే నిరూపించుకున్న అతడు.. ఈసారి వన్డేల్లోనూ అదరగొడుతూ వందతో జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు. కానీ, కుల్దీప్ యాదవ్ (3-29) ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడీ ఓపెనర్
వన్డేల్లో ఓపెనింగ్ జోడీ కష్టాలకు తెరపడింది. టెస్టుల్లో సత్తా చాటిన జస్టిన్ గ్రీవ్స్(107) యాభై ఓవర్ల ఫార్మాట్లలోనూ చెలరేగాడు. భారత పర్యటన తొలి వన్డేలో ఖతర్నాక్ బ్యాటింగ్‌తో అలరిస్తూ సెంచరీ బాదేశాడు. తిరువనంతపురంలో టీమిండియా బౌలర్లను కాచుకున్ గ్రీవ్స్.. 12 ఫోర్లతో శతకం అందుకున్నాడు.
First of many for Justin Greaves! 💯🔥
One of the most improved cricketers in recent times. A great sign for the Windies as they find a solid all-rounder. ✍️#INDvWI #ODIs #Sportskeeda pic.twitter.com/5ygMs35Jl4
— Sportskeeda (@Sportskeeda) September 27, 2026
జడేజా ఓవర్లో పాయింట్ దిశగా సింగిల్ తీసిన అతడు.. హెల్మెట్ తీసి శతక సంబురాలు చేసుకున్నాడు. భారత గడ్డపై వన్డేల్లో సెంచరీ కొట్టిన పదమూడో కరీబియన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన గ్రీవ్స్‌ను.. డగౌట్ నుంచి కోచ్ డారెన్ సమీ, కెప్టెన్ షాయ్ హోప్‌లు అభినందించారు. అయితే.. ఆ తర్వాత కుల్దీప్ (3-29) ఓవర్లో గ్రీవ్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో.. 198 వద్ద విండీస్ నాలుగో వికెట్ పడింది.