అమరావతి : ఏపీలోని విజయవాడ పరిధి నున్న పోలీస్స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న అహ్మద్ అలీ ( CI Ahmed Ali ) గుండెపోటుతో ( Heart attack ) మృతి చెందారు. ఆదివారం అలంకార్ ధర్నాచౌక్ సెంటర్లో విధుల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సీఐను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు.
సీఐ ఆకస్మిక మృతి పట్ల హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సీఐ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.