Amit Shah : దేశంలోనే తొలి ఎల్ఎన్జీ రైలు (LNG train) ను కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్ (Gujarat) లోని సబర్మతి రైల్వేస్టేషన్ (Sabarmati Railway Station) లో ఈ ప్రారంభోత్సవం జరిగింది. హైడ్రోజన్ (Hydrozen) తో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా.. ప్రపంచంలో ఈ సాంకేతికత కలిగిన నాలుగు దేశాల సరసన భారత్ (India) నిలిచింది. రైలు ప్రారంభం అనంతరం నిర్వహించిన సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. దేశ రైల్వే వ్యవస్థను ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) సమూలంగా మార్చారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన పాలనలో కుంభకోణాలు తప్ప ఇంకేమీ చేయలేదని విమర్శించారు. గత 12 ఏళ్లలో ప్రధాని మోదీపై ఎవరూ అవినీతి ఆరోపణలు చేయలేకపోయారని అన్నారు. అర్థరహితంగా మాట్లాడే హస్తం పార్టీని.. వాస్తవాలు, గణాంకాల ఆధారంగా చర్చకు రావాలని సవాల్ చేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ప్రత్యేక సరకు రవాణా కారిడార్, రాపిడ్ రైల్ సిస్టమ్, అత్యాధునిక స్టేషన్లకు శ్రీకారం చుట్టారన్నారు. హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా ప్రపంచంలో ఆ సాంకేతికత కలిగిన నాలుగు దేశాల సరసన భారత్‌ను నిలిపారని కొనియాడారు.
ముంబయి నుంచి వడోదర వరకు మొట్టమొదటి లాంగ్ డబుల్ స్టాక్ కంటైనర్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని అమిత్ షా అన్నారు. మొత్తం 11 వేల కిలోమీటర్ల రైలు కారిడార్‌ను నాలుగు ట్రాక్‌ల నెట్‌వర్క్‌గా మార్చుతున్నామని తెలిపారు. ఇదిలావుంటే ఈ కొత్త రైలు ఎల్ఎన్జీ, డీజిల్ రెండింటిపై నడుస్తుందన్నారు. డీజిల్ వినియోగంలో సుమారు 40 శాతాన్ని ఎల్ఎన్జీతో భర్తీ చేస్తుందని చెప్పారు. డీజిల్ వినియోగం, ఇంధన ఖర్చులు, ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఎల్ఎన్జీ రైలును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.