KPCC chief : వందేమాతరం (Vandematharam) విషయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) వైఖరి మార్చుకునే ప్రసక్తే లేదని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు (Karnataka PCC Chief) బీకే హరిప్రసాద్ (BK Hariprasad) స్పష్టంచేశారు. జైలుకు పంపినా, ఉరి తీసినా వందేమాతరం రెండు చరణాలనే పాడతామని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేత (Congress Leader) సోనియా గాంధీ (Sonia Gandhi) జాతీయ గేయాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. వందేమాతరాన్ని తప్పుగా ఆలపిస్తున్న తీరును మాత్రమే సోనియా గాంధీ ప్రశ్నించారని తెలిపారు.
ఢిల్లీలో మంగళవారం మీడియాతో హరిప్రసాద్ మాట్లాడారు. వందేమాతరం వివాదం వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. వందేమాతరాన్ని సరిగ్గా పాడాలని సోనియాగాంధీ సూచించారని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు 84 ఏళ్లు ఉన్నాయని గుర్తుచేశారు. కాళ్ల సమస్యలతో ఎక్కువసేపు నిలబడలేరని చెప్పారు. అందుకే ఆయన కోసం కుర్చీ తీసుకురావాలని సోనియా సూచించారని హరిప్రసాద్ తెలిపారు.
వందేమాతరం జాతీయ గీతం విషయంలో తమకు పాఠాలు చెప్పే అర్హత బీజేపీ, ఆర్ఎస్ఎస్కు లేదని హరిప్రసాద్ అన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం ‘నమస్తే సదా వత్సలే’ తర్వాత వారు ఎన్నిసార్లు వందేమాతరం, జాతీయగీతం పాడారో చెప్పాలని సవాల్ చేశారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆర్ఎస్ఎస్ దేశ వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగమైన నినాదాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్వీకరించాయా అని ప్రశ్నించారు.
రాహుల్‌గాంధీ వందేమాతరం పాడబోమని చెప్పినట్లు ప్రచారంలో ఉన్న వీడియోపై తనకు అవగాహన లేదని హరిప్రసాద్ తెలిపారు. అయితే కాంగ్రెస్ వైఖరిని మాత్రం స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తగా, రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు చరణాలనే పాడుతామని పేర్కొన్నారు. జైలుకు పంపినా, ఉరి తీసినా తమ నిర్ణయం మారదని తేల్చిచెప్పారు.