Deliveries | అర్వపల్లి మార్చి 4 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం సూచించారు. ఇవాళ అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తల సమావేశంలో కోటాచలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, డిపో హోల్డర్ ఏర్పాటుచేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఆశా కార్యకర్తలు ప్రతీ గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించి కాన్పు అయ్యే విధంగా చూడాలని అన్నారు. ఇబ్బంది సమయపాలన పాటించాలని విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి భూక్య నగేష్ నాయక్, సామాజిక ఆరోగ్య అధికారి బిచ్చు నాయక్, డిఎంపిఓ సురేష్, సూపర్వైజర్ లలిత, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు