రేపటి నుంచే నీట్ యూజీ కౌన్సెలింగ్
ఎంబీబీఎస్‌తో పాటు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు సంబంధించిన మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కాబోతున్నది.
- సెప్టెంబర్ 8 నుంచి అకడమిక్ సెషన్
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్‌తో పాటు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు సంబంధించిన మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కాబోతున్నది. అలాగే 2026-27 అకడమిక్ సెషన్ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కాబోతున్నదని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం ఆగస్టు 4 నుంచి 17 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆగస్టు 22 జాయిన్ కావడానికి చివరి తేదీ. రెండో రౌండు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరుగనున్నది. మూడో రౌండు సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 18 వరకు జరగనున్నది. మిగిలిన సీట్ల కోసం నిర్వహించే రౌండ్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 దాకా జరుగనున్నది.
రాష్ర్టాల కోటా రౌండ్ 13 నుంచి..
రాష్ట్ర కోటా సీట్ల విషయానికొస్తే మొదటి రౌండ్ ఆగస్టు 13 నుంచి 22వ తేదీ దాకా జరుగనున్నది. అభ్యర్థులు ఆగస్టు 28లోపు కోర్సుల్లో చేరాల్సి ఉంటుంది. రెండో రౌండు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు, మూడో రౌండ్ సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 26 దాకా జరుగనున్నది. రాష్ర్టాలకు సంబంధించి మిగిలిన సీట్లకు జరిగే రౌండ్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5 దాకా జరుగనున్నది. అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర సంస్థలు, యూనివర్సిటీలు కచ్చితంగా ఈ షెడ్యూల్‌ను పాటించాలని ఎంసీసీ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

