చాలామంది రచయితలు తమ రచనలను తల్లిదండ్రులకు, కుటుంబంలోని ముఖ్యమైన వారికి అంకితం ఇస్తుంటారు. గంగుల నరసింహారెడ్డి అందుకు పూర్తిగా విభిన్నమైన వ్యక్తి. ఎప్పుడో 43 ఏళ్ల క్రితం తనతో కలిసి పనిచేసిన నల్లూరి వీర రాఘవయ్యకు.. తమ స్నేహానికి గుర్తుగా ఈ కథల సంపుటిని అంకితం ఇచ్చారు. మానవ సంబంధాల పట్ల తన కృతజ్ఞతను చాటుకున్నారు. 1983 నుంచి మొదలు.. గతేడాది వరకు వివిధ పత్రికలకు రాసిన కథలను పుస్తక రూపంలో తీసుకురావడం గొప్ప సాహసమనే చెప్పాలి. మొత్తం పద్నాలుగు కథలతో రూపుదిద్దుకున్న ఈ పుస్తకం ద్వారా పాఠకుల్లో భావోద్వేగాలను తట్టి లేపి.. సామాజిక బాధ్యతలను గుర్తు చేశారు.
ఒకవైపు వానలు రాక పత్తి పంట ఆగమైతదని కలత చెందుతున్న అనంతరెడ్డి, మరోవైపు తన దాంపత్య ఉద్వేగాన్ని మదిలోనే తలుచుకొని కుమిలి పోతున్న అనంతరెడ్డి కూతురు భార్గవి. చివరికి ఆ నిండు జీవితాలపై ‘వాన కురిసింది’. పరాయి వ్యక్తులైనా కూడా రాత్రి సమయంలో బాధ్యతగా తనను ఇల్లు చేరిస్తే.. ఆ సమయంలో స్త్రీ శీలం చెడిపోకుండా ఇంటికి రాదనే తన భర్త మూర్ఖత్వాన్ని, అలా తయారు చేసిన ఈ సమాజాన్ని ‘కుల్లిన సంఘం’లో కడిగిపారేస్తుంది ఓ ఇల్లాలు. ఇంకా ఎందుకు ఈ అంటరానితనమంటూ ‘ప్రశ్న’ను సంధిస్తూనే.. తరువాతి కథలో వృత్తిరీత్యా రచయిత బ్యాంక్ ఎంప్లాయ్ అయినప్పటికీ బ్యాంకులు పెట్టే బాధలకు రైతు పడుతున్న కష్టాలను ‘ఎ లోన్ స్టోరీ’ ద్వారా పరిచయం చేశారు. ఇలా ఒకో కథలో ఒక్కో ప్రత్యేకతను చాటుతూ పాఠకున్ని కట్టిపడేశారు నరసింహారెడ్డి.
రచయిత: గంగుల నరసింహారెడ్డి
పేజీలు: 144, ధర:రూ.180
ప్రతులకు: 9010284700
– రాజు పిల్లనగోయిన
రచన : పేరూరు బాలసుబ్రమణ్యం
పేజీలు : 106;
ధర : రూ.125
ప్రచురణ : చరిత ప్రచురణలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 98492 24162
రచన : డి. శ్యామ్సుందర్ రావు
పేజీలు : 144;
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 99086 48376