‘డ్యూడ్’ కలెక్షన్లు వందకోట్లు క్రాస్ చేసింది. ప్రేక్షకాదరణ వల్లే ఇది సాధ్యమైంది. నా లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలను ఆదరించారు. ‘డ్యూడ్’తో నాకు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. మీ సపోర్ట్‌కి ఎప్పటికీ నా కృతజ్ఞతలు.’ అని ప్రదీప్ రంగనాథన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’. మమితా బైజు కథానాయిక. కీర్తిశ్వరన్ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై వై.రవిశంకర్, నవీన్ యర్నేని నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడారు. ఇది మరింత స్పెషల్ మూమెంట్ అని, వందకోట్ల వసూళ్లు క్రాస్ చేయడం సామాన్యమైన విషయం కాదని కథానాయిక మమితా బైజు పేర్కొన్నారు. ఇది తమ సంస్థకే మెమొరబుల్ ఫిల్మ్ అని నిర్మాత వై.రవిశంకర్ అన్నారు. ఈ కొలాబరేషన్లో అద్భుతమైన విజయం వచ్చినందుకు ఆనందంగా ఉందని దర్శకుడు కీర్తీశ్వరన్ చెప్పారు. ఇంకా ఎస్కేఎన్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి, రైటర్ కృష్ణ కూడా మాట్లాడారు.