మెంతికూర: రెండు కట్టలు
ఆవాలు: టీ స్పూను
ఇంగువ: కొద్దిగా
మినప్పప్పు: టీ స్పూను
శనగపప్పు: టీ స్పూను
ఎండు మిరపకాయలు: పది
నూనె: టేబుల్ స్పూను
ఉప్పు వేసి పెట్టిన ఉసిరి తొక్కు: నాలుగు స్పూన్లు లేదా
ఉసిరికాయలు: పది
ఉప్పు: తగినంత
ముందుగా మెంతి కూరను తెంచి కడిగి ఆరబెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి అందులో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో ఇందాక ఆరబెట్టుకున్న మెంతి ఆకుల్ని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకొని వేయించి పక్కకు పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని పొడిపట్టుకోవాలి. దాన్ని తీసి వేయించుకున్న ఆకుల్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో ఈ పొడితో పాటు ఉసిరితొక్కు, సరిపడినంత ఉప్పు వేసి మళ్లీ నాలుగు తిప్పులు తిప్పాలి. ఒకవేళ ముందు చేసిన ఉసిరి తొక్కు లేకపోతే ఉసిరి కాయల్ని తరిగి మిక్సీ పట్టుకొని వాడుకోవచ్చు. పుల్లపుల్లగా ఉండే మెంతి ఆకు పచ్చడి తినాలంటే దీన్ని ట్రై చేయాల్సిందే!