జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే ‘కిష్కింధపురి’ రూపంలో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారామె. వచ్చే ఫిబ్రవరికి అనుపమకు 30ఏళ్లు నిండుతాయి. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అనుపమ. ‘పెళ్లి చేసుకుంటాను. కానీ దానికి టైమ్ ఉంది. చేసుకుంటే మాత్రం కచ్ఛితంగా లవ్మ్యారేజే చేసుకుంటా. అది కూడా ఇంట్లోవాళ్లను ఒప్పించి చేసుకుంటా.’ అని చెప్పారు అనుపమ.
ఇంతకీ ప్రేమలో ఉన్నట్టా? లేనట్టా? అనడిగితే.. ‘అది మాత్రం సస్పెన్స్..’ అని సింపుల్గా సమాధానమిచ్చారు అనుపమ పరమేశ్వరన్. ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడం ద్వారా ఇప్పటికే తను ప్రేమలో ఉన్నట్టు చెప్పకనే చెప్పిందంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ ఒక్క ఏడాది ఇప్పటివరకూ అన్ని భాషలూ కలిపి అనుపమ నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. హీరోయిన్లలో ఇది నిజంగా రికార్డ్.