చేర్యాల అభివృద్ధికి కృషిచేయాలి
చేర్యాల పట్టణాభివృద్ధి మున్సిపల్ నూతన పాలకవర్గం కృషిచేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణబాల్నర్సయ్య, వైస్ చైర్పర్సన్ మేడిశెట్టి ఉమాశ్రీధర్, కౌన్సిలర్లు కమలాపురం గీతాంజలి, నిమ్మ సుప్రజరాజీవ్రెడ్డి, బుదాద్రి సురేష్, వీరబత్తిని సదానందం, ఎజాజ్అహ్మద్(బబ్లూ) పదవీ స్వీకారం శుక్రవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో జరిగింది.
- మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వడం లేదు
- జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- చేర్యాల మున్సిపల్ పాలకవర్గం ప్రమాణస్వీకారం
చేర్యాల, ఫిబ్రవరి 27 : చేర్యాల పట్టణాభివృద్ధి మున్సిపల్ నూతన పాలకవర్గం కృషిచేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణబాల్నర్సయ్య, వైస్ చైర్పర్సన్ మేడిశెట్టి ఉమాశ్రీధర్, కౌన్సిలర్లు కమలాపురం గీతాంజలి, నిమ్మ సుప్రజరాజీవ్రెడ్డి, బుదాద్రి సురేష్, వీరబత్తిని సదానందం, ఎజాజ్అహ్మద్(బబ్లూ) పదవీ స్వీకారం శుక్రవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో జరిగింది.
నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పట్టణంలోని పీఎంఆర్ గార్డెన్స్‌లో జరిగిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ పాలకవర్గం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు చేర్యాలను మున్సిపాలిటీ చేసిందన్నారు. కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో చేర్యాల పట్టణం అభివృద్ధి చెందిందన్నారు.తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రూ.15 కోట్లు చేర్యాల మున్సిపాలిటీకి మంజూరు చేయించానని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి నిధులు మున్సిపాలిటీలకు ఇవ్వలేదన్నారు. దీంతో అభివృద్ధి జరగడం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా చేర్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రజల సమస్యలను ఎపట్టికప్పుడు పరిష్కరించాలని చేర్యాల పాత దవాఖాన భవనంలో బస్తీ దవాఖాన సైతం మంజూరు చేయించానని, త్వరలో వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్య పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి యేల్లు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ,మండల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, మేక సంతోష్, మంద యాదగిరి,మహిళ పట్టణ అధ్యక్షురాలు తాడెం రంజితాకృష్ణమూర్తి, నాయకులు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మంగోలు చంటి, శివగారి అంజయ్య, అవుశెర్ల కిష్టయ్య,నాచగొని పద్మవెంకట్గౌడ్, తలారీ కిషన్, సిలువేరు సిద్దప్ప, బొంగు రాజేందర్‌రెడ్డి, యాట యాదగిరి, సిద్దిపేట కౌన్సిలర్ వారాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

