హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సర్వైకల్(గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ నివారణ లక్ష్యంగా నేటి నుంచి హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
కింగ్ కోఠి జిల్లా దవాఖానలో నేడు (శనివారం) ఉదయం 11 గంటలకు వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల మంది బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.