పెద్దేముల్, అక్టోబర్ 25 : మండలంలోని నర్సాపూర్, ఆత్కూర్, రుద్రారం, ఇందూర్, పెద్దేముల్తండా తదితర గ్రామాల్లో శనివారం రాత్రి డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. వింత శబ్దాలు చేస్తూ గబ్బిలాల మాదిరిగా తిరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇండ్ల నుంచి బయటికొచ్చి డ్రోన్లు ఎందుకు తిరుగుతున్నాయోనని అయోమయానికి గురయ్యారు.
సెల్ఫోన్లలో వాటిని చిత్రీకరించారు. వెంటనే పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించినా వారు ఎలాంటి విషయాలు బహిర్గతం చేయలేదు. విచారణ చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇండ్ల మీదుగా డ్రోన్లు తిరగడంతో స్థానికులు భయాం దోళనకు గురవుతున్నారు.