ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Sep 06, 2020 , 01:59:05

రక్షించే చెప్పులు

రక్షించే చెప్పులు

హైదరాబాద్‌కు చెందిన 17 ఏండ్ల   సిద్ధార్థ మండల ఆత్మరక్షణకు ఉపయోగపడే చెప్పులను రూపొందించాడు.  భౌతికంగా దాడులను నిరోధించడానికీ, ముఖ్యంగా మహిళలకు ఈ  చెప్పులు ఉపయోగపడతాయని సిద్దార్థ అంటున్నాడు. ఇవి టెక్నాలజీ ఆధారిత ఎలక్ట్రో చెప్పులు.  ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వీటిద్వారా దాడి చేస్తున్న వారికి కరెంట్‌ షాక్‌ ఇవ్వొచ్చు. ఇవి మామూలు చెప్పుల్లానే కనిపిస్తాయి . కానీ, ఇందులో రీ చార్జెబుల్‌ బ్యాటరీ,  చిన్న సర్క్యూట్‌ ఏర్పాటు చేశాడు.   వీటిని ధరించి నడిస్తే చాలు ఆటోమేటిక్‌గా రీచార్జ్‌  అవుతాయి.  ఫుల్‌ చార్జ్‌ అయిన చెప్పుల్లో దాదాపు 0.1 ఆంపియర్ల విద్యుత్‌ నిలువ అవుతుంది. ఈ విద్యుత్‌తో తాత్కాలిక్‌ షాక్‌కు ఇవ్వొచ్చని సిద్దార్థ్‌ అంటున్నాడు. ముఖ్యంగా ఆత్మరక్షణకు వీటిని ఉపయోగించడం వల్ల ప్రమాదాల నుంచి భయపడవచ్చని చెబుతున్నాడు. వీటిని తొందర్లోనే మార్కెట్‌లోకి విడుదల చేస్తానని అంటున్నాడు.  


logo