Children Stories | ఒక ఊర్లె ఇద్దరు సోపతోల్లు ఉంటుండె. అండ్ల ఒగాయినెకు దేవుడంటె మాలెస్క బత్తి. శెట్లల్ల, పుట్టలల్ల, మట్టిల, మానుల దేవుడున్నడని నమ్ముతుండె. ఇమానంతోని బతుకుతుండె. ఇంకోడు ‘దేవుడు లేడు గీవుడు లేదు!’ అనుకుంట వాదన జేశెటోడు. అయినా ఆల్ల సోపతి మాత్రం సోపతే. ఏడికైనా కలిశే వోవుడు.. కలిశే అచ్చుడు. ఏపని జేసినా కలిశే జేద్దురు.
కని ఎందుకనో ఈ మజ్జన దేవుడు లేదనెటోడు శీటికి, మాటికి లొల్లివెట్టవట్టిండు. అయిందానికి కానిదానికి వాదన జెయ్యవట్టిండు. ఒక్కోపారి కొంచెం ఎక్వ జెయ్యవట్టిండు. ఏమన్నంటె.. ‘ఈ బండల నీ దేవున్ని జూపియ్యి! యీ పుట్టల జూపియ్యి!’ అనుకుంట ఇకయికలాడవట్టిండు.
ఇద్దరు సోపతిగాల్లకు ఆపతివడి పొరుగూరుకు పొయ్యే పనివడ్డది. ఎప్పటి తీర్గనే ఈల్లిద్దరు వాదన జేసుకుంటనే పోవట్టిండ్రు. పోంగ పోంగ దేవున్ని నమ్మెటాయినెకు ఒక శెట్టు గనవడంగనే ఆగి.. అంగిఅంగి దండాలు వెట్టిండు. కిందికి మీదికి బస్కీలు దీశిండు. ఇది జూసి నవ్వుకుంట.. ఇంకోడు శెట్టును అటీటు వంచిండు. కొమ్మలు ఇరిశి పారేశి ఇకయిక.. పకపక నవ్విండు.
‘సరే తియ్యి! ఎవ్వని పాపాన ఆడే వోతడు!’ అని మొదటోడు సముదాయించుకుని నడిశిండు. అంతట్లకే ఆనికి ఇంకో శెట్టు కనవడ్డది. మల్ల అదే తరీక.. రెండోనిదీ అదే పద్ధతి.
ఎట్లనన్న ఈనికి బుద్ది జెప్పాల్నెనుకొని అటీటు జూసుకుంట నడవ వట్టిండు. అంతట్లకే ఒక శెట్టును సూడంగనే ఈని కండ్లు సుక్కలోలె మెరిశినయి. ఉరుక్కుంట వోయి శెట్టు సుట్టు పాటలు వాడుకుంట తిరిగిండు. పొర్లుదండాలు వెట్టిండు. అప్పటిదాంక జేసినదానికంటె జెరంత ఎక్వే జేశిండు. ఇదంత సూశిన రెండోడు ఉండవట్టలేక అడుగుతె.. “ఇసొంటి దేవుని శెట్టు ఈ దునియల లేదు” అన్నడు. అవన్ని ఇనంగనే ఆనికి శిర్రుకచ్చింది. ఉరికిపోయి రెండు శేతులువట్టి శెట్టు ఆకులన్ని దూశిండు. కాళ్లకింద ఏశి తొక్కిండు. ఆకులన్ని దూసి మీద సల్లుకున్నడు. తన ఇకమతు వారినందుకు మొదటోడు వోయి దూరంగ గూసోని సూడవట్టిండు. అంతట్లకే రెండోని పెయ్యంత గులగుల వెట్టవట్టింది. పర్రపర్ర గోక్కోవట్టిండు. గోకీ గోకీ రత్తం గారతంది. ఇదంత జూసుకుంట మొదటోడు నవ్వవట్టిండు. అది దూల్దుమ్మ శెట్టని ఎన్కశీరి రెండోనికి ఎరుకైంది. అయిందానికి, కాందానికి కాలడ్డం బెడితె ఏమైతదో ఎరుకైంది. ఉరికిపోయి దగ్గరున్న శెరువుల దుంకిండు.
… పత్తిపాక మోహన్
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు
Children stories | వంకాయ కూర వండమని మొగడు చెబితే ఈ పెండ్లం చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు
children stories | రాజు కొబ్బరి చెట్లు పెంచుమని హుకూం చేస్తే ఇకమతులోడు ఎట్ల ఎగ్గొట్టిండంటే