Children Stories | తాగొచ్చి రోజూ పెండ్లాన్ని కొడుతుండని.. పక్కింటోళ్లు ఇంట్లకెల్లి చూస్తే మొగడి అసలు ముచ్చట బయటపడ్డది
Children Stories | ఇంట్లకెల్లి మొగడు, పెండ్లాం గాని.. ఎవ్వలు బైటకచ్చెటోల్లు గాదు. ఇంట్లకెల్లి లొల్లి మాత్రం ఇనత్తుండె. ‘కోడికూర అండలే!’.. ‘బగార బువ్వ జెయ్యలే!’.. ‘కోడిగుడ్లు తేలే!’.. అనుకుంటఇయ్యర మయ్యర కట్టెలతోని గొట్టుడు.. ఆడకట్టోల్లకు ఇనచ్చే ముచ్చట
Children Stories | ఒక ఊర్లె ఇద్దరాలు మొగలు ఉండెటోల్లు. మొగడు పొద్దుందాక, తెల్లందాంక తాగుతనే ఉండెటోడు. పెండ్లాం, పిల్లలు కూలి జేసి పైసలుదెత్తే.. ఆయిన్ని పైసలు తాగుడుకే ఆంబుక్క వెడుతుండె. ఇల్లంత నాశినం జేత్తుండె. తాగుడే గాకుండ రోజు రాత్రి ఇల్లంత ఆగమాగం జేత్తుండె! సుట్టు పక్కలోల్లకు రాత్రంత ఈల్ల లొల్లితోనె అయ్యేది. మీదికెల్లి కొట్టుడు.. తిట్టుడు! రోజు ఆడకట్టుల ఇదే సినిమా నడిశేది. అయితె.. ఈ కతంత ఇంట్లనే అయ్యేది.
ఇంట్లకెల్లి మొగడు, పెండ్లాం గాని.. ఎవ్వలు బైటకచ్చెటోల్లు గాదు. ఇంట్లకెల్లి లొల్లి మాత్రం ఇనత్తుండె. ‘కోడికూర అండలే!’.. ‘బగార బువ్వ జెయ్యలే!’.. ‘కోడిగుడ్లు తేలే!’.. అనుకుంట ఒర్రుడు, ఇయ్యర మయ్యర కట్టెలతోని గొట్టుడు.. దినాం ఆడకట్టోల్లకు ఇనచ్చే ముచ్చట. ఆడకట్టోల్లంత ‘అయ్యో!’ అనుకుంట ఆమెను పాపం అనెటోల్లు.
రోజు తీర్గనే ఆ దినాన గూడ ఆల్లింట్లకెల్లి లొల్లి ఇనరావట్టింది. గంట రెండు గంటలల్ల ఈల్ల లొల్లి అయిపోతుండె. కని ఆయాల్ల లొల్లి ఎంతకు అయిపోకపోంగ.. ‘సావు… సావు’ అనుకుంట ఒర్రుడు బాగ ఇనవడవట్టింది. కట్టెతోని కొడుతున్న సప్పుడు గూడ రావట్టింది. ‘అయ్యో పాపం!’ అనుకుంట ఆడకట్టు ఆడోల్లందరు కూడవలుక్కోని.. ‘ఎట్లయితె అట్లాయె!’ అని దర్వాజలు నూక్కుంట వోయిండ్లు.
ఇంట్లకురికి ఆడ ముచ్చట జూడంగనె.. అందరు పరేశానైండ్లు. ఆ తాగుబోతోన్ని పెండ్లాం, పిల్లలు తలో దిక్కు వట్టుకొని ఇయ్యర మయ్యర గొడుతాండ్లు. ఆడు దెబ్బలు దినుకుంటనే.. “ఏయ్! నిన్ను సంపుత! నరుకుత!” అంట ఒర్రుతాండు. అసలు ముచ్చట ఎరుకై.. కుల్లం కుల్ల అయ్యెటాల్లకు ఆడకట్టోల్లందరు నవ్వుకుంట ఇండ్లకు మల్లిండ్లు.
… పత్తిపాక మోహన్
Read More :
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు
Children stories | వంకాయ కూర వండమని మొగడు చెబితే ఈ పెండ్లం చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు
children stories | రాజు కొబ్బరి చెట్లు పెంచుమని హుకూం చేస్తే ఇకమతులోడు ఎట్ల ఎగ్గొట్టిండంటే
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

