Children Stories | పైసల్ నాయ్ అంటే నాయ్ అని కొట్టుకున్న ఇద్దరు షాపోళ్లు.. అసలు దొంగను బీర్బల్ ఎట్ట పట్టుకున్నడు?
children stories ( akbar birbal stories ) | ఒక ఊర్ల ఒక నూనె అమ్మెటాయినె, మాంసం అమ్మెటాయినె పక్కపక్కనే ఉండెటోల్లు. ఆల్లకు శనం పడక వోయేది. ఎప్పుడు లొల్లి వెట్టుకుందురు. ఒకపారి ఇద్దరికి పెద్ద లొల్లయ్యింది. రాస్తాలనే గల్లలు వట్టుకొని ఒకల్లనొకళ్లు మస్తుగ కొట్టుకున్నరు.
children stories ( akbar birbal stories ) | ఒక ఊర్ల ఒక నూనె అమ్మెటాయినె, మాంసం అమ్మెటాయినె పక్కపక్కనే ఉండెటోల్లు. ఆల్లకు శనం పడక వోయేది. ఎప్పుడు లొల్లి వెట్టుకుందురు. ఒకపారి ఇద్దరికి పెద్ద లొల్లయ్యింది. రాస్తాలనే గల్లలు వట్టుకొని ఒకల్లనొకళ్లు మస్తుగ కొట్టుకున్నరు. ఈల్ల లొల్లేంటిదో!? ఎందుకు కొట్టుకుంటాండ్లో.. సూసెటోల్లకు ఎరుకగాలే.
ఆఖరుకు అందరు గలిసి ఆల్లను ఇడిపిచ్చిండ్లు. ఇట్లయితె కత మంచిగలేదని.. ఆల్లిద్దర్ని మంత్రి బీర్బల్ తానికి తోల్కవోయి.. ఇద్దరు పూటుగ కొట్టుకున్నరని పిర్యాదయ్యిండ్లు. కతేందని అడిగిండు బీర్బల్. అడిగిందాల్శంలేదు, మాంసం దుకునమాయినె.. “జనాబ్! నేను దుకాండ్ల దంద జేసుకుంటుంటె ఈ నూనె దుకునమాయినె అచ్చి.. ‘మంచి నూనె అచ్చింది.. తీస్కో!’ అంట అడిగిండు. నేను నూనె వట్టనీకి బగోనె గిన్నె దేను లోపలికోయి అచ్చెటాలకు నా దుకాండ్ల కెల్లి పైసల సంచి మాయం జేశిండు” అంట జెప్పిండు. ఆ సంచిల పైసలున్నయని, ఎట్లనన్న ఇప్పించాల్నని వంగి వంగి సలాంలు జేశిండు.
ముచ్చటంత ఇని, నూనె దుకునమాయినె దిక్కు దిరిగి.. ‘ఏంది? కతంత నిజమేనా!?’ అంట అడిగినట్టు జూశిండు బీర్బల్. దానికి నూనె దుకునమాయినె.. “లేదు జనాబ్! ఈడే అన్ని తొండీలు.. బట్టెబాజీ ముచ్చట్లు జెప్తాండు. అవ్వతోడు! ఇమానంగ ఆ పైసల ముల్లె నాదే! పెద్ద పండుక్కు అప్పాలు జేసుకునెతందుకు అందరు ఎప్పటికంటె ఎక్వ నూనె గొన్క పేయిండ్లు. ఈ తాప పైసలు గొన్ని ఎక్వ అచ్చినయి. ఒక్కన్నె లెక్కవెట్టలేక పక్క దుకునపాయినె అని సాయం బిల్శిన. పైసలు సూడంగనె నియ్యతి దప్పి.. ‘అన్నీ నాయె!’ అంట గుంజుకో వట్టిండు. కట్టమంత కండ్ల ముంగట్నే పోవట్టె. ఉండవట్టలేక రెండు మూడు ఉతికిన. మాఫ్ కర్నా.. జనాబ్!” అంట దండం బెట్టిండు. ఇద్దరి మాటలిని, ఇద్దరి దిక్కు సూశిండు బీర్బల్. ఇద్దరి శేతులు.. సంచిలున్న పైసలను మల్లమల్ల జూశిండు. ముచ్చట ఎర్కైంది. అయినా ఇద్దర్ని నిజం జెప్పుమంట మల్లమల్ల అడిగిండు. అదే ముచ్చట.. ఇద్దరు అట్లనే మల్లమల్ల జెప్పిండ్లు. ఎట్లనన్న దొంగకు బుద్ధిజెప్పాల్నని అనుకుని బటున్ని తాంబాలంల నీల్లు దెమ్మని జెప్పిండు. నీల్లు తేంగనే సంచిలున్న పైసలన్ని అండ్ల కుమ్మరిచ్చిండు. ఆడున్నోల్లకు.. పిర్యాదయినోల్లకు ఏం అర్తంగాలేదు. ఒక శనం ఆగి, బటుల్ని విలిశి.. మాంసం దుకునమాయినెను లోపలెయ్యిమని జెప్పిండు. ఎంటనే లబోదిబో మొత్తుకుంట.. “తప్పయ్యింది.. మాఫ్కర్నా సర్కార్!” అంట బతిలాడవట్టిండు. దొంగనెట్ల వట్టిండో ఎవలకు అర్తంగాక తాయిమాయి అయ్యిండ్రు. బీర్బల్ నవ్వుకుంట.. “ఈ పైసలను నూనె దుకునమాయినె పైస పైస కూడవెట్టుకున్నడు. నీళ్లల్ల పైసలేయంగనే పైసలకంటిన నూనెంత నీళ్లమీద వేరింది” అంట జెప్పిండు.
. పత్తిపాకమోహన్
Read More :
Children Stories | తమ్మున్ని చూసి ఓర్వలేక చేసిన పనికి ఇజ్జత్ పోగొట్టుకున్న అన్న..
చంపి తిందామని వచ్చిన తోడేలును భలే బురిడీ కుట్టించిన కుందేలు
Children Stories | రంభనే నా పెండ్లాం
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

