Children Stories | రంభనే నా పెండ్లాం
Children Stories | అడివి దేవత ముచ్చట ఎర్కయి శెర్ల కెల్లి రంభను తోల్కచ్చింది. “ఇగో! ఈమెనేనా నీ పెండ్లాం” అంట అడిగింది. “ఔ! ఔ!.. ఈమెనే నా పెండ్లాం!” అనుకుంట జెల్దిన గుంజుకున్నడు.
Children Stories | ఇది మనకు తెలిశిన కతనేనుల్లో! ఒక ఊర్లె ఒక కట్టెలు గొట్టి అమ్మెటాయినె ఉండెటోడు. దినాము ఎగిలివారంగనే లేశి, జంగల్కు వోయి, కట్టెలు గొట్టుడు.. కొట్టిన కట్టెలు మోపులు గట్టి, సుట్టుపక్కల ఊల్లల్ల అమ్ముడు.. ఆనికి తెలిశిన పని. ఎప్పటి తీర్గనే ఎగిలివారంగ లేశి గొడ్డలి దీస్కోని జంగల్కు వోయిండు. ఆ దినం ఎంత దిరిగినా సుట్టుపక్కల ఎక్కడ ఎండిపేయిన చెట్లు గనవడలే. తిరుగంగ తిరుగంగ ఒక పెద్ద శెరువు గట్టు మీద.. సగం ఎండిపేయిన చెట్టు కానచ్చింది. ‘అమ్మయ్య!’ అనుకుంట మెల్లమెల్లగ చెట్టెక్కి, ఒక్కో కొమ్మ కొట్టవట్టిండు. పొద్దుగాల సంది ఎండల దిరిగి దిరిగి శెక్కరచ్చినట్టు అయ్యిందేమో.. శేతిల గొడ్డలి ఒక్కపాలి శెరువుల వడ్డది.
ఉన్నదే ఒక్క గొడ్డలి. శెర్లకు దిగి లెంకులాడుతమంటే ఈత రాకపాయె! శెరువు నిండుగున్నది. ఏం జేయాల్నో తోయకపాయె. ‘పోరగాండ్లకు, ఇంటిదానికి బువ్వెట్ల వెట్టాలె’ అంట కండ్లనీరు వెట్టుకుని, కుములవట్టిండు. ఈని దుఃఖం సూడలేక అడివితల్లి కనిపిచ్చింది. “ఏమైంది.. ఒక్కనివే గూసొని ఎందుకేడుత్తున్నవ్!?” అంట అడిగింది. దానికాడు.. “తల్లీ! ఉన్నదొక్కటే గొడ్డలి. అదాయింత నీల్లల్ల వడ్డది. రేపటిసంది బువ్వకెట్ల?” అంట శోకం బెట్టిండు.
అడివితల్లి నీల్లల బుడుంగున మునిగి.. బంగారి గొడ్డలి తెచ్చింది. “ఇగో.. గిది నీ గొడ్డలేనా?” అంట అడిగింది. దానికాయినె.. “కాదు” అన్నడు. మల్ల మునిగింది. ఈ తాప ఎండకు తలతల ఎలుగుతున్న ఎండి గొడ్డలి దెచ్చింది. “ఇగో.. మరి గిదా ఏంది?” అంట అడిగింది. దానికాయినె.. “అయ్యో! ఇది ఇంకెవలన్న వోగొట్టుకున్నరు గావచ్చు. ఇది నాది గాదు!” అంట అన్నడు. దేవత మల్ల మునిగింది. ఈ తాప ఆడు పారేసుకున్న ఇనుప గొడ్డలి దెచ్చింది. దాన్ని సూడంగనే ఆని కండ్లు సూర్యచంద్రులోలె ఎలిగినయి. “అవ్వా! నీకు దండం. గిదే గిదే నా గొడ్డలి” అంట జెల్దిన తీసుకొని, పానం పానమోలె నిమిరిండు. అడివితల్లి ఆని మంచితనానికి మస్తు సంతోషపడ్డది. అయిన్ని రెండు గొడ్డల్లు ఇచ్చింది. ఎండి గొడ్డలి, బంగారు గొడ్డల్లను అమ్ముకొని.. పట్నంల పెద్ద కట్టెల దుకాణం వెట్టుకొని, మస్తు సీమంతుడైండు. ఒకపారి ఈనె, ఈనె పెండ్లాం పొరుగూరు తీర్తం బోయి తిరుగు పయానమైండ్లు. బువ్వటాల్లకు అడవికి జేరిండ్లు. శెరువు కాడ కూసొని సద్ది తిన్నరు. గిన్నెలు కడుగవోయి ఈనె పెడ్లాం శెరువుల వడి మునిగిపేయింది. ఈనెకు ఈత రాకపాయె. ఏడ్సుకుంట గూసున్నడు. గొడ్డలిచ్చిన అడివి దేవత మల్ల జూశింది. ముచ్చట ఎర్కయి శెర్ల కెల్లి రంభను తోల్కచ్చింది. “ఇగో! ఈమెనేనా నీ పెండ్లాం” అంట అడిగింది. “ఔ! ఔ!.. ఈమెనే నా పెండ్లాం!” అనుకుంట జెల్దిన గుంజుకున్నడు. పైసలచ్చినంక బేయిమాన్ అయ్యిండని.. అడివితల్లి వాణ్ని ఇయ్యరమయ్యర తిట్టవట్టింది. అడివి తల్లికి దండం బెట్టి.. “అవ్వా! నువ్వు ఈమె గాదంటె మల్ల మునుగుతవు. మల్లొకల్లను తెత్తవు. ఆఖర్కు ముగ్గురిని నాకే ఇత్తవు. ఆ ముగ్గురిని సాదుడు.. మూడు కొప్పులతోని ఏగుడు నాతోని గాదు. అందుకే ఈమెనే నా పెండ్లమన్న” అన్నడు. అడివిదేవత నవ్వి.. బుడుంగున మనిగి, ఆని పెండ్లాన్ని తెచ్చిచ్చింది. అడివి దేవతకు దండం బెట్టి ఆలుమొగలు ఇంటి బాట వట్టిండ్రు.
Read More :
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జగన్నాథ స్వామి
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

