Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Children Stories | మొదటి దొంగతనమని దొంగసామాను కట్టుకునెతందుకు కొత్త దోతి కొనుక్కున్నడు. దేవునికి దండం బెట్టుకుని దొంగతనానికి బైలెల్లిండు. ఆనాడు పున్నం.. కొత్త దొంగ గద. ఆనికి తేడా తెల్వలేదు.
Children Stories | ఒక ఊర్లె ఒక బేవార్సుగాడు ఉండెటోడు. ఆనికి ఏపనీ శాతగాలే. ఏ కశ్పి అచ్చిరాలె. సప్పుడుజేయక దొంగతనం జేసుకుని బతుకుదమని తయారైండు. ఆడు కొత్త దొంగనాయె.. అప్పటిదాంక దొంగతనం జేయకపాయె.. మీదికెల్లి జరంత దేడ్ దిమాక్! రెండుమూడు దినాలు సుట్టుముట్టు ఊర్లు తిరిగి సూశిండు.
తిర్గంగ తిర్గంగ ఇద్దరు ముసలోల్లున్న ఒకిల్లు కనిపిచ్చింది. ఇదయితే నయ్యమని అనుకున్నడు. అనుకున్నదనుకున్నట్టే.. ఆ రోజు మాపటీలి కన్నమేశి దొరికినకాడికి సర్సుకపోవాలని అనుకున్నడు. కడుపు నిండ దిన్నడు. మొదటి దొంగతనమని దొంగసామాను కట్టుకునెతందుకు కొత్త దోతి కొనుక్కున్నడు. దేవునికి దండం బెట్టుకుని దొంగతనానికి బైలెల్లిండు. ఆనాడు పున్నం.. కొత్త దొంగ గద. ఆనికి తేడా తెల్వలేదు. అనుకున్నట్టే పొద్దుగాల జూసుకున్న ఇంటికాడికి వేయిండు. మెల్లగ ఇల్లెక్కి గూన పెంకలు తీసి లోపలికి దిగిండు. గూనపెంకల సప్పుడు కాంగనే ఇంట్లున్నోళ్లకు ఎవడో దొంగత్తండని ఎరుకైంది. కట్టె, కారం దగ్గర వెట్టుకుని పన్నట్టు నాట్కం ఆడిండ్రు. కొత్త దొంగోడు నడింటి మీది గూనలు దీయంగనే.. నడింట్ల ఎన్నెల ఎలుగు సాపంత వడ్డది. ఎంట దెచ్చిన కొత్త దోతి కింద వర్శిండు. సామాను సదుర్కచ్చెతందుకు సాయిమాన్లకు వేయిండు. ఆడు అటు వోంగనే.. ఇంటాయినే కొత్త దోతి గుంజుకుని నెత్తికింద వెట్టుకుని, ఆడు జేసేది సూడవట్టిండు. దొంగోడు ఇల్లంత దిరుక్కుంట తీరొక్క సామాను దెచ్చి.. ఎన్నెల ఎలుగును ఎంట దెచ్చిన కొత్త దోతి అనుకొని జమజేయ వట్టిండు. ఎలుగునిండ సామానంత వర్శినంక.. ఎక్కువైతే మూసుడైతదో లేదో అని సాలిచ్చుకున్నడు. ఇక ఆ కొన.. ఈ కొన ముల్లె గట్టవోయిండు. ఎంత గుంజినా శేతికి బట్ట అంటుతలేదు. ఆని తండ్లాట జూశి నవ్వాపుకొని.. ఇంటాయినే మెల్లగ సరాయించిండు. సప్పుడినంగనే దొంగోడు తలుపు దీసుకొని ఒకటే లంకె వెట్టిండు. ఇంటాయినె ఆనెన్కనే ఉరుక్కుంట..
“ఓ బావా! ఇప్పుడు నాకు కొత్త పంచె దెచ్చినవు గదా! గట్లనే మల్లచ్చినప్పుడు మీ అక్కగ్గూడ కొత్త చీరె దీస్కరా” అంట ఒర్ర వట్టిండు. నడిమిరాత్రి ఒర్రుడిని బైటకచ్చిన సుట్టుపక్కలోళ్లు.. కతంత ఇని మస్తుగ నవ్వుకున్నరు. ఎన్నెల రాత్రి అయిన నాడల్ల ఆ ఊరోల్లు ఆ దేడ్ దిమాక్ దొంగోన్ని యాజ్జేసుకోని రోజు లేదు.
… పత్తిపాక మోహన్
Read More :
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు
Children stories | వంకాయ కూర వండమని మొగడు చెబితే ఈ పెండ్లం చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు
children stories | రాజు కొబ్బరి చెట్లు పెంచుమని హుకూం చేస్తే ఇకమతులోడు ఎట్ల ఎగ్గొట్టిండంటే
Children Stories | తమ్మున్ని చూసి ఓర్వలేక చేసిన పనికి ఇజ్జత్ పోగొట్టుకున్న అన్న..
చంపి తిందామని వచ్చిన తోడేలును భలే బురిడీ కుట్టించిన కుందేలు
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

