Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు
Children stories | ఆడ ఏమి దెల్వనోని లెక్క ఎడ్డెడ్డిగ మాట్లాడుకుంట.. మంచి మ్యాకపిల్లను అగ్వసగ్వకు గొన్నడు. ఈని ఎడ్డీర్కం జూసి.. పాపమని తక్వ ధరకే మ్యాకపిల్లను అమ్మిండు సావుకారి.
Children stories | ఒక ఊర్లె ఒక ఇకమతులోడు ఉంటుండె. బమ్మిని తిమ్మిజేసుట్ల.. తిమ్మిని బమ్మిజేసుట్ల ఆనసోంటోడు ఆ సుట్టుపక్కల నూరు మైళ్ల దాంక బాణమేశినా కనిపియ్యడు. ఆల్లింట్ల దేవుని పండుగుందని అత్తగారిని, సుట్టాలను అందరిని విలిశి.. పండుక్కు మ్యాకపిల్లను కొనుక్కద్దమని పక్కూరు సంతకు వోయిండు. ఆడ ఏమి దెల్వనోని లెక్క ఎడ్డెడ్డిగ మాట్లాడుకుంట.. మంచి మ్యాకపిల్లను అగ్వసగ్వకు గొన్నడు. ఈని ఎడ్డీర్కం జూసి.. పాపమని తక్వ ధరకే మ్యాకపిల్లను అమ్మిండు సావుకారి.
ఈడు అంగట్లకు అచ్చినప్పటి సంది.. మర్లివోయెదాంక, ఈని కావలే గాశిండు ఓ దొంగోడు. అగ్వల మ్యాకపిల్ల దొర్కిందన్న మురిపెంల ఆడీడ దిరిగి ఆల్శం జేసిండు. ఇంటికి మర్లెవారకు పొద్దుగూక వట్టింది. అడివిలకెల్లి వోవాలె! దొంగలుగిట్ల ఉంటరని జెల్దిజెల్దిన నడువ వట్టిండు. నట్టనడిమిట్లకు వోంగనే, ఈని కోసమే సూత్తున్న దొంగోడు శెట్టు సాటుకెల్లి అచ్చి ఎదురంగ నిలుసున్నడు. నడుముకు బెల్టు, డబ్బాల్డబ్బాల లుంగీ, శేతుల గుత్పకట్టె.. ఆన్ని సూడంగనే ఇకమతులోనికి ఇషయం అర్తమయ్యింది.
ఇకమతుతోని ఎట్లనన్న తప్పిచ్చుకోవాలని.. “ఏందన్న.. ఈ అడివిల ఏం జేత్తున్నవన్న?” అంట ఎడ్డిఎడ్డిగ అడిగిండు. దానికి ఆ దొంగోడు.. “కనిపిత్తలేదారా? నేను గజదొంగ గంగులును. నక్రాల్ జెయ్యకుంట నీకాడున్న పైసలు, మ్యాకపిల్ల, మెడలున్న కంటె, పెయ్యిమీదున్న బట్టలు అన్ని దీశి ఆడవెట్టి.. ఎన్కకు మర్లకుంటవో! లేదంటె గుత్పకట్టె జూశినవ్ గదా! ఇయ్యరమయ్యర జోపుత” అనుకుంట.. సుట్ట ముట్టిచ్చుకొని నిలుసున్నడు.
దొంగోడు శేరైతే మనోడు సవశేరాయె.. ఆడు జెప్పినట్టే మ్యాకపిల్లను దించి శెట్టుకు గట్టేశిండు. కీసలకెల్లి ఆయిన్ని పైసలు దీశి కింద వోశిండు. పెయ్యిమీదున్న కంటె.. ఎండి కడెం దీశి ఆని కాళ్లకాడ వెట్టిండు. “అన్నా! సలి వెడ్తాంది.. ఇంట్ల అత్తగారోల్లున్నరు. పెయ్యిమీద బట్టల్లేకుంట వోతె పురాత ఇజ్జత్ వోతది. జర బట్టలుండనియ్యరాదు” అంట బతిమిలాడిండు. ‘పుక్యానికె బంగారం, ఎండి, మ్యాక అచ్చినయి.. పాత బట్టలుంటేంది? లేకుంటేంది?’ అనుకొని.. “గట్లనే తియ్యి” అని.. అన్ని సదురుకొని ముల్లె గట్టుకోవట్టిండు. అంతట్లకే మన ఇకమతులోడు.. “అన్నా! నువ్వు సూత్తె మంచోని లెక్క గొడుతున్నవ్. సంతకచ్చి ఏం దీస్కపోకుంటె ఎడ్డోడనుకుంటరు. నీ గుత్పకట్టె కొత్తగనె ఉంది గద. నాకియ్యరాదే” అంట ఎడ్డెడ్డిగ అడిగిండు. ఎడ్డోనితోని ఏమైతదని.. “ఇగవటు” అని గుత్పను ఇసిరేశిండు. కట్టె అందుకోంగనే.. మర్లేశి దొంగోన్ని ఇయ్యరమయ్యర జోపుడు వెట్టిండు. “అయ్యా.. అవ్వా.. సత్తిన్రో!” అనుకుంట.. అన్ని ఆన్నే వారేశి, చెంగోబిల్ల అనుకుంట ఉరికిండు తెలివితక్వ దొంగోడు. ఈని ముల్లెనే గాక దొంగోని ముల్లెగూడ సదుర్కోని ఇకమతులోడు అత్తగారోళ్ల ముంగట రుబాబుతోని ఇంటికి జేరిండు.
. పత్తిపాకమోహన్
Read More :
Children stories | వంకాయ కూర వండమని మొగడు చెబితే ఈ పెండ్లం చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు
children stories | రాజు కొబ్బరి చెట్లు పెంచుమని హుకూం చేస్తే ఇకమతులోడు ఎట్ల ఎగ్గొట్టిండంటే
Children Stories | తమ్మున్ని చూసి ఓర్వలేక చేసిన పనికి ఇజ్జత్ పోగొట్టుకున్న అన్న..
చంపి తిందామని వచ్చిన తోడేలును భలే బురిడీ కుట్టించిన కుందేలు
Children Stories | రంభనే నా పెండ్లాం
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

