Children stories | వంకాయ కూర వండమని మొగడు చెబితే ఈ పెండ్లం చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు
Children stories | ఒక ఊర్లె ఒక ఆసామి, ఆయినె పెండ్లాం పిల్లలు ఉండెటోల్లు. ఒకపారి ఆయినె పొరుగూరుకు వోయిండు. బువ్వటాల్లకు ఒక పూటకూల్లవ్వ ఇంటికి వోయి తిన్నడు. ఆ అవ్వ ఆ దినాన మసాల బేంగన్ అండింది.
Children stories | ఒక ఊర్లె ఒక ఆసామి, ఆయినె పెండ్లాం పిల్లలు ఉండెటోల్లు. ఒకపారి ఆయినె పొరుగూరుకు వోయిండు. బువ్వటాల్లకు ఒక పూటకూల్లవ్వ ఇంటికి వోయి తిన్నడు. ఆ అవ్వ ఆ దినాన మసాల బేంగన్ అండింది. అది ఆయినెకు మస్తు నచ్చింది. ఎట్ల అండుతరో అర్సుకున్నడు. ఇంటికచ్చిందే తడువు.. పెండ్లాన్ని విలిశి మసాల బేంగన్ అండుమని జెప్పిండు. ఎట్ల వండాల్నో… అండ్ల వెట్టే ఉల్లిగడ్డ కారం, తమాట గుజ్జు, మసాలలు అన్ని దెచ్చి ఇచ్చిండు. కనీ ఊరంత ఎంత దిర్గినా అంకాయలు.. అదే బేంగన్ దొర్కలేదు. ఆఖర్కు ఒకకాడ మూడు అంకాయలు గనిపిచ్చినయి.
అడిగిన దరిచ్చి కొనుక్కచ్చి పెండ్లానికి ఇచ్చిండు. మసాల బేంగన్ అండే ఆసనకు కడుపు నిండుతె.. మల్ల తినబుద్ది గాదని, ఖుషీల పెండ్లాన్ని జల్ది అండుమని జెప్పి.. నీళ్లు గట్టి అద్దామని పొలానికి వోయిండు. ఇంటామె మొగని మీద పాయిరంతో వరి అన్నం.. పప్పుశారు జేసింది. అంకాయ పొయ్యి మీద ఏశెతందుకు తయారైంది. మొగడు జెప్పినట్టే మాలెస్కనే గాన్గలకెల్లి ఆయాల్లనే దెచ్చిన నూనె వోశి, మసాలలు మస్తుగ నూరి అంట మొదలువెట్టింది. అంట జేత్తుంటె ఆసనకు నోట్ల మస్తు నీళ్లు ఊరవట్టినయి. పానం ఆపుకొని .. ఎట్లనో వంట జేశింది. మొగడు ఎంతో పానంగ అండుమని జెప్పె.. ఎట్లుందో సయి సూద్దామని ఒక అంకాయ నోట్లేసుకుంది. అముర్తమోలె అనిపిచ్చింది. మాలెస్క సేపైంది. పొలం బేయిన పెనిమిటి ఇంకా రాకపాయె! ‘ఉన్న రెండు అంకాయలల్ల ఒకటి ఎట్లయినా నాదేనాయె!’ అన్కొని ఇంకో అంకాయ తీస్కోని నోట్లేసుకుంది.
ఎండ నెత్తిమీది కచ్చెటాలకు పొలానికి వోయినాయినె తిరిగచ్చిండు. ఇల్లంత అంకాయ ఆసన. జల్ది కాల్రెక్కలు కడుక్కచ్చుకొని పీటల మీద కూసున్నడు. బువ్వ వెట్టి పప్పుశారు వోశి.. అంకాయ కంచం లేశింది పెండ్లాం. కంచుట్ల ఏం లేకపోయెవారకు.. “అగో.. మూడంకాయలు దెత్తి గద! ఒక్కటే ఉంది. ఇంక రెండెవ్వి?” అంట అడిగిండు. “నువ్వు పాయిరంగ అండుమన్నవు గదా! ఉప్పుకారం ఒప్పిందా లేదా అని ఒక అంకాయ సయి శూశిన. ఇంకోటి నాకేనాయె! నాది నేను దిన్న” అంట జెప్పింది పెండ్లాం. కోపంతోని.. “ఎట్ల దిన్నవ్?” అంట రుయ్యరుయ్య సూత్తున్న మొగన్ని జూసి, పెండ్లాంగూడ అంతే కోపంతోని.. “ఇగో.. ఇట్ల దిన్న” అనుకుంట మూడో అంకాయ గూడ ఆంబుక్క వెట్టింది. మరి గదుల్ల.. మసాల అంకాయ! అదే బర్వా బేంగన్ కూరంటె! గందుకె కవులన్నరు గద.. ‘వంకాయ వంటి కూరయు’ అని.
. పత్తిపాకమోహన్
Read More :
children stories | రాజు కొబ్బరి చెట్లు పెంచుమని హుకూం చేస్తే ఇకమతులోడు ఎట్ల ఎగ్గొట్టిండంటే
Children Stories | తమ్మున్ని చూసి ఓర్వలేక చేసిన పనికి ఇజ్జత్ పోగొట్టుకున్న అన్న..
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

