Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | నేను అండిన బువ్వ బియ్యంగాని, కూర అమాంతం అంకాయలు గానీ” అంట శపతం వట్టి, గంప మీదికెల్లి బట్ట దీశింది. గంపల బియ్యం, అంకాయలను సూడంగనే.. అమాంతం పరేశానైన పెనిమిటి పెండ్లాన్ని అలుముకుని కండ్లల్ల నీళ్లువెట్టుకున్నడు.
Children Stories | ఒక ఊర్లె ఇద్దరాలు మొగలు ఉండెటోల్లు. ఆళ్లిద్దరికి ఒగలంటె ఒగలకు పాయిరమంటె పాయిరం. మంచిగ కలిశిమెలిశి ఉండెటోల్లు. కలిశి పని పాట జేసుకుని బతుకెటోల్లు. అన్ని సక్కగనె ఉన్నయి గని.. పెండ్లానికి ముచ్చటంటె బంగారమోలె! ఎవలన్న ముచ్చట్లు వెట్టెటోల్లుంటె.. అన్ని మరిశిపోతది. ఒకపారి పక్కూరికెల్లి ఈమె మేనత్త బిడ్డ అచ్చింది. మాలెస్క దినాలకు అచ్చె.. అండ్ల శిన్నప్పటి సోపతాయె. తెల్లారింసంది శిన్నప్పటి ముచ్చట్లు వెట్టుకుంట పిట్టగోడ కాడ కూసున్నరు. ఈల్లను జూశిన ఇంటాయినె కత ఒడిశెటట్టు లేదని రాత్రి మిగిల్న సద్దన్నం తిని, అంబటాల్లకు బువ్వదెమ్మని పెండ్లానికి జెప్పి పొలానికి వోయిండు.
ఇంకేంది? ఈల్ల ముచ్చట్లకు రోక లేకుంటయింది. అప్పటియి.. ఇప్పటియి.. దోస్తులయి మాట్లాడుకుంట గూసున్నరు. ముచ్చట్లల్ల ఆళ్లకు ఆకలిగాలె.. దూప దెలువలె! పిట్టగోడ నీడ నిలువున నిలుసునె వారెకు.. ఇంటామెకు మొగని తిండి యాదికచ్చింది. అప్పటికే తిండిదినే యాళ్ల గూడ అయిపేంది. మొగని కోపం యాదికచ్చి.. ‘అయ్యో! అవ్వో!’ అంట నెత్తి నోరు గొట్టుకుంది. అంతట్లకె ఇకమాతు దోశింది. అత్త బిడ్డను మాపటీలి జేసిన అరిశెలు తినుమని, బువ్వ గంపల సోలెడు బియ్యం బోశింది. కూర గిన్నెల అంకాయలు, మిర్పకాయలు, ఉల్లిగడ్డ, ఉప్పుకారమేశింది. గంప సంకల వెట్టుకొని సరసర నడుసుకుంట పొలందిక్కు వోయింది.
అప్పటికే ఆమె పెనిమిటి అంబటాల్లయ్యి ఆకలికి నకనకలాడవట్టె. పెండ్లాం ముచ్చట సంగతి ఎరికే గదా! మస్తు కోపం మీదున్నడు. ఆడికెల్లి గంపెత్తుకోని అచ్చుడు సూడంగనె.. ఇయ్యర మయ్యర తిట్టవట్టిండు. ఆమె నడిమిట్లనె తిట్లనాపి.. “ఇయ్యాల్ల నాగులపంచమి గద! పుట్టకు పాలు వోశచ్చెటాలకు గీ యాల్లయ్యింది” అంట జెప్పింది. “అబద్దాలు జెప్పకు! ముచ్చట్లవడి మర్శిపోయినవ్” అనుకుంట కోపానికచ్చిండు పెనిమిటి.
ఎంటనే.. “నేను గిట్ల అబద్దమాడ్తె.. నేను అండిన బువ్వ బియ్యంగాని, కూర అమాంతం అంకాయలు గానీ” అంట శపతం వట్టి, గంప మీదికెల్లి బట్ట దీశింది. గంపల బియ్యం, అంకాయలను సూడంగనే.. అమాంతం పరేశానైన పెనిమిటి పెండ్లాన్ని అలుముకుని కండ్లల్ల నీళ్లువెట్టుకున్నడు. ఇకమతు వారినందుకు పెండ్లాం కుశీ అయ్యింది.
గీ కతను జూశే.. ‘ముచ్చట సంబురంల మొగన్ని మరుసుడు’ అన్న శాత్రం వుట్టిందుల్లో!
… పత్తిపాక మోహన్
Read More :
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు
Children stories | వంకాయ కూర వండమని మొగడు చెబితే ఈ పెండ్లం చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు
children stories | రాజు కొబ్బరి చెట్లు పెంచుమని హుకూం చేస్తే ఇకమతులోడు ఎట్ల ఎగ్గొట్టిండంటే
Children Stories | తమ్మున్ని చూసి ఓర్వలేక చేసిన పనికి ఇజ్జత్ పోగొట్టుకున్న అన్న..
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

