Yashasvi Jaiswal : సుదీర్ఘ ఫార్మాట్లో చెలరేగి ఆడుతున్న భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) స్వల్ప కాలంలోనే ‘రికార్డ్ బ్రేకర్’ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. పిచ్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా బాదుడే పరమావధిగా విధ్వంసం సృష్టించే యశస్వీ మరో ఘనత సాధించాడు. ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న ఈ యువకెరటం బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో రెండు సిక్సర్లు బాదాడు. దాంతో, 2024లో అతడి సిక్సర్ల సంఖ్య 34కు చేరింది. దాంతో, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ (Brendon McCullum) పేరిట ఉన్న రికార్డును యశస్వీ బద్ధలు కొట్టేశాడు.
🚨 HISTORY WRITTEN BY JAISWAL. 🚨
– Yashasvi Jaiswal now has most Test sixes in a calendar year – 34, surpassing Brendon McCullum. 🥶 pic.twitter.com/Qy7KfmnjV4
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2024
విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైనా మెక్కల్లమ్ 2014లో 33 సిక్సర్లతో రికార్డు నెలకొల్పాడు. అప్పటి నుంచి ఎందరో హిట్టర్లు టెస్టుల్లో అరంగేట్రం చేశారు కానీ, బజ్ రికార్డు మాత్రం అలానే ఉంది. అయితే.. యశస్వీ రాకతో సీన్ మారిపోయింది. ఇప్పటికే ‘నయా థౌజండ్‌వాలా’గా రికార్డుల దుమ్ముదులిపిన యశస్వీ నేనున్నాగా అంటూ మెక్‌కల్లమ్‌ను అధిగమించాడు.
పెర్త్ టెస్టులో సెంచరీకి చేరువైన భారత కెరటం ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండర్‌గా మరో రికార్డు తన పేరిట రాసుకున్నాడు. తద్వారా ప్రస్తుత కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) పేరిట ఉన్న 16 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశాడు. 2008లో గంభీర్ 70.67 సగటుతో 1,134 పరుగులు సాధించాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు, 3 శతకాలు ఉన్నాయి. అదే యశస్వీ మాత్రం 1,161 పరుగులతో గౌతీని అధిగమించాడు.
#YashasviJaiswal didn’t hesitate! 😁
“It’s coming too slow!” – words no fast bowler ever wants to hear! 👀
📺 #AUSvINDOnStar 👉 1st Test, Day 2, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/8eFvxunGGv
— Star Sports (@StarSportsIndia) November 23, 2024