Pawan Kalyan – Devendra Rajesh Kothe | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఫలితాల్లో మహాయుతి (Mahayuti) కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 స్థానాలకు గానూ 229 స్థానాల్లో మొదటి నుంచి లీడింగ్‌లో ఉన్న మహాయుతి (Mahayuti) కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 220 సిట్లతో దూసుకుపోతుంది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ పవన్ కల్యాణ్ పాల్గోన్న విషయం తెలిసిందే. బీజేపీ కూటమి అభ్యర్థుల తరపున పలు ప్రాంతాల్లో ప్రచారం చేశాడు పవన్. అయితే పవన్ ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది.
ఇక పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఒకటైన సోలాపూర్ సిటీ సెంట్రల్ బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే ఘన విజయం సాధించాడు. దేవేంద్ర విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ విజయం కేవలం అయన వల్లే సాధ్యమైంది. అయన ఫాన్స్‌కి.. సపోర్టర్స్‌కి చాలా థాంక్స్. రెండు గంటలు మీరు చేసిన రోడ్ షోకి భారీగా జనాలు వచ్చి సపోర్ట్ చేసారు. మీ మాటలతో మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను మీరు ప్రభావితం చేశారు అని దేవేంద్ర తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది