Kalpana Soren | జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఆధిక్యంలో దూసుకుపోతున్నది. ఈ క్రమంలో హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ సంతోషం వ్యక్తం చేశారు. జార్ఖండ్ ప్రజలు అభివృద్ధిని ఎంచుకున్నారన్నారు. హేమంత్ సోరెన్‌ను ప్రజలు ఆశీర్వదించాలని.. త్వరలో ప్రజాప్రభుత్వం రాబోతుందన్నారు. తనను ప్రేమను చూపి.. కూతురిలా ఆశీర్వదించినందుకు గాండే, గిరిదిహ్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఇటీవల రెండుదశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఓట్ల లెక్కింపు శనివారం జరుగుతున్నది. ఓట్ల లెక్కింపు జరిగిన సమయంలో ఎన్డీయే ఆధిక్యంలో కనిపించింది.
అయితే, రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతున్నా కొద్దీ ఎన్డీయే కూటమి లీడ్‌లోకి వచ్చింది. సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ గిరిదిహ్‌లోని గాండే స్థానం నుంచి పోటీ చేశారు. కల్పన మొదటిసారి ఎమ్మెల్యే గాండే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్డీయే కూటమికి చెందిన బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై ఆమె 27,149 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తాజాగా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగగా.. బీజేపీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మునియా దేవిని బరిలో నిలిపింది. ఆమె రెండుసార్లు జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పని చేసింది. మునియా దేవి జూన్ 2023లో బీజేపీలో చేరారు. ఆమెపై 13వేల ఓట్లపైగా ఆధిక్యంలో ఉన్నారు.