Perth Test : పెర్త్ టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలిరోజు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jaspirt Bumrah) నిప్పులు చెరగడంతో ఆస్ట్రేలియాను ఆలౌట్ ప్రమాదంలో నెట్టిన టీమిండియా రెండో రోజు సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. ఆసీస్ బ్యాటర్లు తడబడిన చోట ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(90 నాటౌట్), కేఎల్ రాహుల్(62 నాటౌట్)లు కుమ్మేశారు. ప్రపంచ స్థాయి పేస్ దళాన్ని అలవోకగా ఎదుర్నొన్న ఈ జోడీ అజేయ అర్ధ శతకాలతో కంగారూ బౌలర్లను కంగారెత్తించింది.
బంతి మరీ బౌన్స్ కాకపోవడంతో నింపాదిగా ఆడుతూ టీమిండియా ఆధిక్యాన్ని రెండొందలు దాటించారు. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు వికెట్ కోల్పోకుండా 172 పరుగులు చేసింది. దాంతో.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా సేన బోణీ కొట్టే దిశగా సాగుతోంది.
ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జస్ప్రీత్ బుమ్రా(5/30), హర్షిత్ రానా(3/48)ల ధాటికి తొలి సెషన్లోనే కుప్పకూలింది. దాంతో, టీమిండియాకు పరుగుల ఆధిక్యం లభించింది. అయితే.. ఆస్ట్రేలియా బ్యాటర్లు విఫలమైన చోట మనోళ్లు ఆడుతారా? ఆదిలోనే వికెట్లు పడకుంటే చాలు.. అని కొంచెం కంగారు అభిమానుల్లో మొదలైంది. కానీ, ఆస్ట్రేలియా పేసర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. ఏ పొరపాటు చేయకుండా ఆడారు ఓపెనర్లు యశస్వీ రాహుల్(90 నాటౌట్), కేఎల్ రాహుల్(62 నాటౌట్)లు. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు వీళ్లు అదిరే ఆరంభమిచ్చారు.
That’s Stumps on Day 2 of the first #AUSvIND Test!
A mighty batting performance from #TeamIndia! 💪 💪
9⃣0⃣* for Yashasvi Jaiswal
6⃣2⃣* for KL RahulWe will be back tomorrow for Day 3 action! ⌛️
Scorecard ▶️ https://t.co/gTqS3UPruo pic.twitter.com/JA2APCmCjx
— BCCI (@BCCI) November 23, 2024
మొదటి రోజులా పిచ్ అనూహ్యంగా బౌన్స్ కాలేదు. దాంతో, ఆసీస్ పేస్ దళం ఏమాత్రం ప్రభావం చూపకలేకపోయింది. కాసేపు ఓపికగా డిఫెన్స్ ఆడిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బ్యాట్ ఝులిపించారు. యశస్వీ దూకుడు కనబరిచినా రాహుల్ మాత్రం తొందరపడలేదు. కంగారూ కెప్టెన్ కమిన్స్ వ్యూహాల్ని దెబ్బకొడుతూ ఈ ఇద్దరూ చకచకా సింగిల్స్, డబుల్స్ తీశారు. చెత్త బంతుల్ని బౌండరీకి తరలించి ఆతిథ్య జట్టును ఒత్తిడిలో పడేశారు.
1⃣5⃣0⃣ up for the opening stand ✅
KL Rahul 🤝 Yashasvi Jaiswal#TeamIndia‘s lead approaching 200 💪 💪
Live ▶️ https://t.co/gTqS3UPruo#AUSvIND pic.twitter.com/Y2x5FRMmRV
— BCCI (@BCCI) November 23, 2024
లియాన్‌ను సైతం సమర్ధంగా ఎదుర్కొన్న రాహుల్, యశస్వీలు అర్ధ శతకాలతో కదం తొక్కారు. ఈ జోడీని విడదీసేందుకు కమిన్స్ ఎన్ని ఎత్తులు వేసినా ఫలించలేదు. దాంతో, ఈరోజు మనది కాదులే అనుకొని ఆసీస్ ఆటగాళ్లు యశస్వీ, రాహుల్ బ్యాటింగ్ విన్యాసాలను అలా చూస్తుండిపోయారు. యశస్వీ, రాహుల్‌లు అజేయంగా అర్ధశతకాలు బాదడంతో ఆట ముగిసే సరికి భారత జట్టు 172 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి 218 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది.