నయనానందం.. ఎదుర్కోలు సంబురం.. జగన్మోహినిగా యాదగిరీశుడు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ముక్కోటి దేవతలసాక్షిగా తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి నయనానందకరంగా సాగింది. అలంకార నరసింహస్వామి వారిని అశ్వవాహనంపై ప్రధానాలయ కల్యాణ మండపం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు.
- అశ్వవాహన సేవలో ఊరేగింపు
- నేడు స్వామివారి తిరుకల్యాణం
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 24 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ముక్కోటి దేవతలసాక్షిగా తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి నయనానందకరంగా సాగింది. అలంకార నరసింహస్వామి వారిని అశ్వవాహనంపై ప్రధానాలయ కల్యాణ మండపం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేదపండితులు, అధికారులు స్వామి, అమ్మవార్ల వైపు రెండు జట్లుగా ఎదుర్కోలు తంతు నిర్వహించారు. అర్చక బృందం స్వామివారి మహిమలు, భక్తజనరక్షణలు వివరిస్తూ ఆసక్తికరంగా వాదాలు జరిపారు.
స్వామివారు ఉదయం 9 గంటలకు జగన్మోహిని రూపంలో తిరుమాఢ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ముఖ్య ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి 9.30 గంటలకు అంగరంగవైభవంగా జరుపనున్నారు. మండపం ఎదురుగా వీవీఐపీలు, భక్తులకు ప్రత్యేకమైన బారికేడ్లతో ఏర్పాట్లు పూర్తిచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు హాజరుకానున్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

