జర్నలిస్టులకూ క్యాష్‌లెస్ హెల్త్ కార్డులివ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకూ క్యాష్‌లెస్ హెల్త్‌కార్డులు అమలు చేయాలని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీ అనంతరం ఉద్యోగులకు క్యాష్‌లెస్ హెల్త్‌కార్డు సీమ్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. దానిలో జర్నలిస్టులను చేర్చకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
- ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకూ అమలు చేయాలి
- తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమానికి మరో ఉద్యమం చేసేందుకూ సిద్ధం
- టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం
- బీమా సొమ్ము చెల్లించండి: ఆసాని
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకూ క్యాష్‌లెస్ హెల్త్‌కార్డులు అమలు చేయాలని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీ అనంతరం ఉద్యోగులకు క్యాష్‌లెస్ హెల్త్‌కార్డు సీమ్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. దానిలో జర్నలిస్టులను చేర్చకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం టీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు పోరాడి సాధించుకున్న హెల్త్‌కార్డులను, కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులను నాలుగేండ్లపాటు అన్ని కార్పొరేట్ దవాఖానల్లో చెల్లుబాటు అయ్యేలా అమలు చేశారని గుర్తుచేశారు. ఆనాడు రాష్ట్రంలోని జర్నలిస్టులకు కోట్లాది రూపాయల వైద్యసాయం అందిందని చెప్పారు. అదే కార్డు ఇప్పటివరకు నిమ్స్ వంటి దవాఖానల్లో చెల్లుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి చెప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా జర్నలిస్టులకు ఒక పైసా మేలు చేయలేదని విమర్శించారు. అక్రెడిటేషన్ కార్డు ల్లో కోత విధించడం, హెల్త్‌కార్డును తీసివేసే ప్ర యత్నాలు చేయడం శోచనీయమని పేర్కొన్నా రు. అసలు తమ దృష్టిలో జర్నలిస్టులు ఉన్న ట్టా? లేనట్టా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
హెల్త్‌కార్డు కోసం పోరుబాట
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డు అమలు చేయాలని, లేదంటే ఈ ప్రభుత్వానికి జర్నలిస్టుల ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తామని అల్లం నారాయణ హెచ్చరించారు. తెలంగాణ సాధన కోసం 14 ఏండ్లపాటు పోరాడిన వాళ్లం, జర్నలిస్టుల ప్రయోజనాల కోసం మరోసారి పోరాడుతామని తేల్చిచెప్పారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అక్రెడిటేషన్ కార్డుల్లో కోత, హెల్త్‌కార్డును తొలగించడం దారుణమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగానే జర్నలిస్టులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డు అమలు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి పీ యోగానంద్, హైదరాబాద్ నగర ఇన్చార్జి యార నవీన్‌కుమార్, టీయూడబ్ల్యూజే నగర కోశాధికారి బాపూరావు, కేబుల్ చానళ్ల జర్నలిస్టుల జేఏసీ నేత కడకంచి వెంకటేశ్, టీయూడబ్ల్యూజే నేత లాయక్ పాషా తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల అరెస్టు అక్రమం : టీయూడబ్ల్యూజే
వార్తా సేకరణకు వెళ్తున్న జర్నలిస్టులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ సంఘం అభిప్రాయపడింది. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను తమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతిసాగర్ తెలిపారు. ఖమ్మంలో జరుగుతున్న భూ వ్యవహారానికి సంబంధించిన వార్తల సేకరణకు వెళ్తున్న తొలివెలుగు జర్నలిస్టు రఘు, కాళోజీ టీవీ జర్నలిస్ట్ దాసరి శ్రీనివాస్, నగేశ్‌తో పాటు మరికొందరిని నకిరేకల్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడం అన్యాయమన్నారు. ఈ అరెస్టులు రాజ్యాంగస్ఫూర్తికి విఘాతమని, రాజ్యాంగం మీడియాకు స్వేచ్ఛ కల్పిస్తే ఇలాంటి అరెస్టుల ద్వారా ప్రభుత్వం దానిని హరిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

