న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఏసీల ధరలను పెంచుతున్నట్టు వోల్టాస్ ప్రకటించింది. రాగి ధరలు భగ్గుమనడంతోపాటు రూపాయి బలహీనపడటంతో ఈ ఏడాది ఎయిర్ కండిషనర్ల ధరలను 5-15 శాతం వరకు పెంచేయోచనలో సంస్థ ఉన్నట్టు కంపెనీ ఎండీ ముకుందన్ మీనన్ తెలిపారు.
రాగి టన్ను ధర ప్రస్తుతం 12,000-13,000 డాలర్ల మధ్యలోకి చేరుకోవడంతో దీంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ధరలు పెంచుతున్నట్టు చెప్పారు.