ICC :టెస్టులకు జీవం పోసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) అంతిమ సమరం తేదీ వచ్చేసింది. ఈసారి కూడా ఇంగ్లండ్ వేదికగా టోర్నీ జరుగనుంది. అయితే.. తొలిసారి లార్డ్స్(Lords) స్టేడియం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వెల్లడించింది. జూన్ 11 నుంచి 15వ తేదీల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తామని ఐసీసీ తెలిపింది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు లార్డ్స్ స్టేడియం వేదికవ్వడం ఇది మొదటిసారి. తొలి సీజన్లో టీమిండియా(Team India)ను ఓడించిన న్యూజిలాండ్ టెస్టు గద(Test Mace)ను ముద్దాడింది. 2022-23లో కూడా భారత్ ఫైనల్ చేరినా ఆస్ట్రేలియా(Australia) ధాటికి నిలవలేక ట్రోఫీని చేజార్చుకుంది. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేది ఎవరు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Mark your calendars 🗓️
Dates for the #WTC25 Final are here 👀
Details 👇https://t.co/XkBvnlYIDZ
— ICC (@ICC) September 3, 2024
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2024-25 సీజన్లో టాప్ -2లో ఉన్న రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. త్వరలోనే సొంతగడ్డపై బంగ్లాదేశ్ (Bangladesh)తో రెండు టెస్టులు.. ఆ తర్వాత కంగారూ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లలో రోహిత్ సేన పంజా విసిరితే మూడోసారి ఫైనల్ చేరడం ఖాయం. అదే జరిగితే.. మరోసారి టీమిండియా, ఆసీస్‌ల మధ్య ఫైనల్ ఫైట్ జరిగే అవకాశం లేకపోలేదు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2024-25 పట్టికలో టీమిండియా, ఆసీస్‌లు టాప్‌లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్‌పై ఈమధ్యే టెస్టు సిరీస్ గెలుపొందిన దక్షిణాఫ్రికా జట్టు ఐదో స్థానంలో నిలిచింది. ఇక పాకిస్థాన్‌పై చారిత్రాత్మక విజయంతో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ ఆరో స్థానానికి దూసుకొచ్చింది. శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్‌లు వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి.