పుదీనా: ఒక కప్పు, గోధుమపిండి: రెండు కప్పులు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, జీలకర్ర: ఒక టీస్పూన్, గరం మసాల: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
పుదీనా ఆకును శుభ్రంగా కడిగి పెట్టు కోవాలి. మిక్సీ గిన్నెలో పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, గరంమసాల, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, పుదీనా మిశ్రమం, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు నాననివ్వాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీలు ఒత్తుకుని కాగిన నూనెలో దోరగా వేయించుకుంటే పుదీనా పూరి సిద్ధం.