AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఇతర నేతలపై కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాల్సిందిపోయి.. ఫేక్ ప్రచారం చేస్తూ వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. విపత్తు సమయాల్లో ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని అన్నారు.
సీఎం చంద్రబాబు ఇంటికి, బుడమేరు వాగుకు సంబంధం ఏంటని జగన్ను రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగని విమర్శించారు. విపత్తుల సమయంలో ఎలా పనిచేయాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితవుపలికారు. జగన్ ఇప్పటికైనా మారకపోతే ఆయన్ను ప్రజా జీవితం నుంచి కూడా బయటకు పంపుతారని పేర్కొన్నారు.
వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి 25 బృందాలు, 5 హెలికాప్టర్లు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా నిత్యవసరాలు పంపిస్తున్నామని చెప్పారు. కేంద్రం కూడా సహకారం అందిస్తుందన్నారు. నేవీ హెలికాప్టర్లను కూడా పెంచుతామని పేర్కొన్నారు.