రావల్పిండి: పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్(Bangladesh) ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లా క్వీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 185 రన్స్ టార్గెట్‌తో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఇవాళ అయిదో రోజు 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్నది. బంగ్లా బ్యాటర్లలో జాకిర్ హసన్ 40, ఇస్లామ్ 24, షాంతో 38, మోహుల్ హక్ 34 రన్స్ చేసి ఔటయ్యారు. ముష్ఫికిర్(22), షకీబ్(21)లు నాటౌట్‌గా నిలిచారు.
ఓటమి నుంచి తప్పించుకునేందుకు షాన్ మసూద్ నేతృత్వంలోని పాక్ జట్టు తీవ్ర ప్రయత్నం చేసింది.ఇప్పటి వరకు బంగ్లాదేశ్ విదేశాల్లో రెండు టెస్టు సిరీస్‌లను గెలుచుకున్నది. 2009లో వెస్టిండీస్‌తో, 2021లో జింబాబ్వేతో జరిగిన సిరీస్‌ల్లో విజయం సాధించింది.
స్కోరుబోర్డు
పాకిస్థాన్ 274, 172
బంగ్లాదేశ్ 262, 185
Bangladesh clinch their first Test series win against Pakistan 🤩#WTC25 | #PAKvBAN 📝: https://t.co/mhkrlhMLyU pic.twitter.com/hqlZbQZlOE
— ICC (@ICC) September 3, 2024