Women’s Asia Cup : మహిళల ఆసియా కప్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. జూలై 19వ తేదీన శ్రీలంక వేదికగా ఆరంభ కానున్న ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. టోర్నీకి మరో 24 గంటలే ఉన్నందుకున ఇప్పటికే అన్ని జట్లు లంకకు చేరుకున్నాయి. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా ఆసియా కప్‌లో అడుగుపెట్టనున్న టీమిండియా (Team India) మరోసారి ట్రోఫీపై కన్నేసింది. భారత జట్టు తొలి పోరులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఎదురుపడనుంది. మెగా టోర్నీలో టీమిండియా షెడ్యూల్ ఇదీ..
ఆసియా కప్ 2024లో భారత జట్టు గ్రూప్ ఏ లో ఉంది. టీ20 ఫార్మాట్లో జరుగనున్న ఈ మెగా టోర్నీ తొలి పోరులోనే భారత్‌కు గట్టి పరీక్ష ఎదురవ్వనుంది. ఆసియా కప్ ఆరంభం రోజే టీమిండియా రాత్రి 7:00 గంటలకు పాకిస్థాన్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. అనంతరం జూలై 21న మధ్యాహ్నం 2 గంటలకు పసికూన యూఏఈ జట్టుతో, జూలై 23న నేపాల్‌తో భారత జట్టు ఢీ కొట్టనుంది.
జూలై 19వ తేదీ శుక్రవారం – యూఏఈ vs నేపాల్, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 19 వ తేదీ శుక్రవారం – భారత్ vs పాకిస్థాన్, రాత్రి 7:00 గంటలకు
జూలై 20 శనివారం – మలేషియా vs థాయ్‌లాండ్, మధ్యాహ్నం2 గంటలకు
జూలై 20 శనివారం – శ్రీలంక vs బంగ్లాదేశ్, రా త్రి 7:00 గంటలకు
జూలై 21 ఆదివారం – భారత్ vs యూఏఈ, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 21 ఆదివారం – పాకిస్థాన్ vsనేపాల్, రాత్రి 7:00 గంటలకు
జూలై 22 సోమవారం – శ్రీలంక vs మలేషియా, మధ్యాహ్నం 2:00 గంటలకు

జూలై 22 సోమవారం – బంగ్లాదేశ్ vs థాయ్‌లాండ్, రాత్రి 7:00 గంటలకు
జూలై 23 మంగళవారం – పాకిస్థాన్ vs యూఏఈ, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 23 మంగళవారం – భారత్ vs నేపాల్ రాత్రి, 7 గంటలకు
జూలై 24 బుధవారం – బంగ్లాదేశ్ vs మలేషియా, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 24 బుధవారం – శ్రీలంక vs థాయ్‌లాండ్, రాత్రి 7:00 గంటలకు
జూలై 26 శుక్రవారం – సెమీఫైనల్ 1, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 26 శుక్రవారం – 2 ,రాత్రి 7:00 గంటలకు
జూలై 28 ఆదివారం – ఫైనల్, రాత్రి 7:00 గంటలకు
ఏడుసార్లు ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటి. ఎందుకంటే… టాపార్డర్ నుంచి మిడిలార్డర్.. బౌలింగ్ యూనిట్ అంతా సూపర్ ఫామ్‌లో ఉంది. సొంత గడ్డపై ఈ మధ్యే మూడు ఫార్మట్ల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను హర్మన్‌ప్రీత్ కౌర్ సేన అల్లాడించింది. అదే జోష్‌లో ఆసియా కప్‌లోనూ చెలరేగాలని టీమిండియా భావిస్తోంది.