హైదరాబాద్ : అదిలాబాద్(Adilabad) మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌పై(Municipality Vice Chairman) అవిశ్వాస తీర్మానం(No confidence) నెగ్గింది. దీంతో వైస్ చైర్మన్ జహీర్ రంజాన్ తన పదవి కోల్పోయారు. మున్సిపా లిటీలో 49 మంది సభ్యులు ఉండగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 34 మంది సభ్యులు ఓటు వేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌కి వ్యతిరేకంగా సొంత పార్టీ కౌన్సిలర్లు ఓటు వేయడం విశేషం. వైస్ చైర్మన్ జహీర్ రంజాని(కాంగ్రెస్)కి వ్యతిరేకంగా అన్ని పార్టీల కౌన్సిలర్లు ఒక్కటయ్యారు.
వైస్ చైర్మన్ పై బీఆర్ఎస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల కౌన్సిలర్లు మద్దతు తెలిపడంతో జహీర్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కాగా, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాని కి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు సైతం మద్దతు తెలిపారని, కాంగ్రెస్ పార్టీలో చేరిన వైస్ చైర్మన్‌ను అందరి సహకారంతో పదవి నుంచి దించినట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు.
సంచలనంగా మారిన ఆదిలాబాద్ రాజకీయం
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కి వ్యతిరేకంగా ఓటు వేసిన సొంత పార్టీ కౌన్సిలర్లు
వైస్ చైర్మన్ జహీర్ రంజాని(కాంగ్రెస్)కి వ్యతిరేకంగా ఒక్కటైన అన్ని పార్టీల కౌన్సిలర్లు.. వైస్ చైర్మన్ పై బీఆర్ఎస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల… pic.twitter.com/V5rCpodlaM
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2024