ఈ వారం లాభాల స్వీకరణ దిశగా మదుపరులు వెళ్తారన్న అంచనాలైతే ఉన్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ పడిపోతున్నది. ఈ ఒత్తిడి కూడా ఈక్విటీలపై ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, వెనెజువెలాపై అమెరికా సైనిక దాడుల వంటివి అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి. దీంతో మెజారిటీ ఇన్వెస్టర్లు ప్రస్తుత లాభాలను ఒడిసి పట్టుకొనేందుకే అవకాశాలున్నాయని అంటున్నారు. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 26,100 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 25,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 26,500-26,700 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.