PM Modi | మహిళల వన్డే వరల్డ్‌కప్ గెలిచిన హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత బృందం (Indian women’s cricket team) బుధవారం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమ్మాయిలతో ప్రధాని మోదీ (PM Modi) సరదాగా ముచ్చటించారు. ప్రతి ప్లేయర్‌తో సంభాషించి వారి వద్ద నుంచి అనేక విషయాలను రాబట్టారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
ప్రధానితో సంభాషణ సందర్భంగా టాపార్డర్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (Harleen Deol) ఓ ఆసక్తికర ప్రశ్న అడిగింది. ‘మీ స్కిన్ ఎప్పుడూ చాలా గ్లోగా కనిపిస్తుంది. మీ స్కిన్‌కేర్ రొటీన్ (Skincare Routine) ఏంటి సర్..?’ అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఇక ఊహించని ఈ ప్రశ్నకు ప్రధాని తొలుత ఆశ్చర్యపోయారు. ‘నేను వాటి గురించి అంతగా ఆలోచించను’ అంటూ సమాధానమిచ్చారు.
Also Read..
PM Modi: దీప్తి శర్మ ‘హనుమాన్ టట్టూ’ గురించి అడిగిన ప్రధాని మోదీ.. వీడియో
Royal Challengers Bengaluru: అమ్మకానికి ఆర్సీబీ.. మార్చి 31 వరకు కొత్త ఓనర్