న్యూఢిల్లీ: మహిళల వన్డే వరల్డ్‌కప్ గెలిచిన హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత బృందం బుధవారం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమ్మాయిలతో ప్రధాని మోదీ ముచ్చటించారు. వారి వద్ద నుంచి అనేక విషయాలను ఆయన రాబట్టారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలిచిన దీప్తి శర్మకు మోదీ ఓ ప్రశ్న వేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘హనుమాన్ టట్టూ’ గురించి ఆయన అడిగారు. దానికి దీప్తి శర్మ బదులిస్తూ.. కష్టకాలంలో హనుమాన్ను స్మరించనున్నట్లు చెప్పింది. నా మీద నా కన్నా హనుమంతుడి మీద నమ్మకం ఉందని దీప్తి పేర్కొన్నది. కష్టాలు వచ్చినప్పుడు హనుమంతుడిని స్మరిస్తానని చెప్పింది. ఆ టైంలో ఆ సమస్య నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో జై శ్రీరామ్ అని రాసుకున్నావా అని మోదీ అడిగిన ప్రశ్నకు అవును అని ఆమె బదులిచ్చింది.
-PM Modi : You’ve Bajrang Bali’s tattoo on your arms, how does it help you?
-Indian cricketer Deepti Sharma- It helps me to overcome my difficulties. I also have ‘Jai Shree Ram’ written on my Instagram bio. pic.twitter.com/69vSyGmaF4
— Mr Sinha (@MrSinha_) November 6, 2025
వరల్డ్ కప్ టోర్నీలో ఓపెనర్ ప్రతీక రావల్ గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే మోదీని కలిసేందుకు ఆమె వీల్‌చైర్‌పై వచ్చింది. ఇక జట్టును కలిసిన సమయంలో మోదీ ఆమె వద్దకు వెళ్లి మాట్లాడారు. కోన్ ఐస్‌క్రీం తీసుకువెళ్లి ఆమెకు అందజేశారు.
You can’t fake moments like this.
PM Modi ji saw Pratika Rawal on a wheelchair and walked over with a cone in hand.
A small gesture but it showed how deeply he cares for our champions. ❤️🇮🇳 pic.twitter.com/1woL3YAqLb— Prof cheems ॐ (@Prof_Cheems) November 6, 2025
ప్లేయర్లు అందరికీ స్వీట్లు పంచారు మోదీ. ఇష్టమైన స్వీట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Most people won’t even know names of all players of Indian Women’s cricket team.
And here is PM Modi, remembering even their fav dishes. pic.twitter.com/bQoGhdKye9
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) November 6, 2025