నయా డస్టర్ కార్లు
ఫ్రెంచ్కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో..మధ్యస్థాయి ఎస్యూవీ డస్టర్ మాడల్‌ను తిరిగి దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. రూ.10.49 లక్షల ప్రారంభ ధరతో ఈ మాడళ్లు లభించనున్నాయని పేర్కొంది.
- ప్రారంభ ధర రూ.10.49 లక్షలు
న్యూఢిల్లీ, మార్చి 17: ఫ్రెంచ్కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో..మధ్యస్థాయి ఎస్యూవీ డస్టర్ మాడల్‌ను తిరిగి దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. రూ.10.49 లక్షల ప్రారంభ ధరతో ఈ మాడళ్లు లభించనున్నాయని పేర్కొంది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఆరు-స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన ఈ మాడల్‌లో త్వరలో హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకొచ్చే ఆలోచనలో సంస్థ ఉన్నది. 1.4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన 1.8 లీటర్ల ఇంజిన్‌తో మాడల్‌ను తీసుకురాబోతున్నది.
ఈ సందర్భంగా రెనో ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఫాన్సిస్కో హిడాల్గో మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ డస్టర్ బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రాలకు పోటీగా సంస్థ ఈ మాడల్‌ను విడుదల చేసింది. 2012లో డస్టర్ ఉత్పత్తిని ప్రారంభించిన సంస్థ..2022లో ఈ మాడల్ ఉత్పత్తిని నిలిపివేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సంస్థ ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడదని, 90 శాతం ప్రాంతీయ విడిభాగాలను కార్లను ఉత్పత్తి చేస్తున్నట్టు, కేవలం 10 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నట్టు చెప్పారు. దీంతోపాటు సంస్థ క్విడ్, ట్రైబర్, కైగర్ మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

