హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా అట్టర్‌ఫ్లాప్ అని బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు విశ్వాసం కోల్పోయారని, అత్యంత విఫల ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలిచారని చురకలు అంటించారు. 99 రోజుల ప్రజాపాలన 9 రోజుల్లోనే బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమానికి నిధులు, విధులు లేవని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెం డున్నరేండ్లు కావస్తున్నా.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని, ప్రజా సంక్షేమంపై వారికి ఏమా త్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మూటలు మోయడానికే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై విశ్వాసం కోల్పోవడంతోనే ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారని పేర్కొన్నారు.
మక్కల కొనుగోలు కేంద్రాలు ఎక్కడ? బీఆర్ఎస్ KP Vivekananda, MLA; Sanjay
రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే సంజయ్ ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రకృతి వైపరీత్యాల సమస్యతో పాటు ప్రభుత్వ వైపరీత్యాలు తోడయ్యాయని పేర్కొన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు లేక రైతులకు రావాల్సిన ధరలో 35 శాతం నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి కరెంటు, పెట్టుబడి లేక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజెంట్‌ని నాశనం చేస్తూ.. ఫ్యూచర్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఆ లోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వ్యవసాయశాఖ మంత్రి కండ్లు తె రువాలని సంజయ్ హితవు పలికారు.