హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఒక కుటుంబం లాంటివారని, అలాంటి మహానాయకుడిపై అనుచితంగా మాట్లాడ టం రాజకీయ విజ్ఞత అనిపించుకోదని, ఆయన నోటి భాషే ఆయన్ను భస్మం చే స్తుందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ములుగు, పరకాల సభల్లో సీఎం రేవంత్ తన బూతుల పరంపరను కొనసాగించారని, ఇలాంటి మాటలకు అలవాటు పడి చివరకు తన నెత్తి మీద తనే చేయి పెట్టుకొని మసైపోతారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మ్యా నిఫెస్టోలో కేవలం సన్నవడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పినట్టు నిరూపిస్తే తాను అరగుండుతో తిరుగుతానని, నిరూపించలేకపోతే రేవంత్‌రెడ్డి గుండు గీసుకుంటారా? అని ము ఖ్యమంత్రికి సవా ల్ విసిరారు. రాష్ట్రంలో నడుస్తున్నది సోషల్ జస్టిస్ కాద ని, అనుముల జస్టిస్ అని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేశారని, చేవెళ్ల, షాబాద్ ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలి భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు.
హనుమంతరావు లాంటి సీనియర్లను పకనపెట్టి రేవంత్‌రెడ్డి తన అనుచరుడు వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ ఇవ్వడం దొరతనం, ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమ ని శ్రవణ్ విమర్శించారు. తన గొంతు కోసి కోదండరామ్‌ను ఎమ్మెల్సీ చేశారని, శిఖండిలా అడ్డం పెట్టుకొని రేవంత్‌రెడ్డి డ్రామా లు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి తన తీరు మార్చకోకపోతే కాంగ్రెస్ పార్టీకి సమాధి తప్పదని, రాహుల్‌గాంధీ, మీనాక్షీనటరాజన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామమూర్తి, గోసుల శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.