Vinod Kumar | నోటీసులపై ఓటర్లకు గడువు పెంచాలి.. ఇదే విషయమై ఈసీఐకి త్వరలోనే లేఖ రాస్తం
ముసాయిదాలో ఓటర్ల పేర్లు ఉండి, సరైన డాక్యుమెంట్లు సమర్పించని 92 లక్షల మందికి నోటీసులు జారీచేస్తామని సీఈవో సమావేశంలో చెప్పారని, నోటీసులకు సమాధానం చెప్పే గడువు నెల రోజులుగా నిర్ణయించడం సరికాదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా సవరణపై సీఈవోతో భేటీ అనంతరం మీడియాతో మాజీ ఎంపీ వినోద్
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ముసాయిదాలో ఓటర్ల పేర్లు ఉండి, సరైన డాక్యుమెంట్లు సమర్పించని 92 లక్షల మందికి నోటీసులు జారీచేస్తామని సీఈవో సమావేశంలో చెప్పారని, నోటీసులకు సమాధానం చెప్పే గడువు నెల రోజులుగా నిర్ణయించడం సరికాదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అన్ని లక్షల దరఖాస్తులు, ఆక్షేపణలను పరిశీలించడానికి కేవ లం 30 రోజుల గడువు సరిపోదని, రాష్ట్రం లో ఇపుడు ఏ ఎన్నికలు లేనందున గడువును మరింత పెంచాలని కోరారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) కూడా త్వరలోనే లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున వినోద్‌కుమార్‌తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్, నాయకుడు వై సతీశ్‌రెడ్డి హాజరయ్యారు.
అనంతరం వినోద్‌కుమార్ మీడియా తో మాట్లాడుతూ.. తెలంగాణలో తాజాగా ప్రచురించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తుది ఓట ర్ల జాబితా కాదని, ఓటర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని అర్హతలుండి లిస్టులో పేరు లేనివారు, లేదా వేరే ప్రాంతాలకు మారిన వారు ఫారమ్-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఇదే విషయాన్ని విస్తృతం గా ప్రచారం చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్టు తెలిపారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటర్ నమోదుపై ఎకువ ఆసక్తి చూపుతున్నారని వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనందున, అధికారులు హడావుడి పడకుండా, ప్రతి ఓటరుకూ స్పష్టమైన అవకాశం కల్పి స్తూ సమగ్రంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని కోరారు. ఓటర్ల తుది జాబితా ప్రచురించే వరకు అర్హులైన ఓటర్లు ఎవ్వరికీ నష్టం కాకుండా బీఆర్ఎస్ తన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

