మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయికుమార్, తనికెళ్ల భరణి, ఆమని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న తెలంగాణ నేపథ్య ప్రేమకథ ‘2కె లవర్స్’. రాజేశ్ నాయుడు దర్శకత్వంలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం ప్రారంభమైంది. దర్శకుడు వీఎన్ ఆదిత్య ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, సంగీత దర్శకుడు మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ ప్రేమకథలో భావోద్వేగాలు బలంగా ఉంటాయని దర్శకుడు రాజేశ్ నాయుడు తెలిపారు. తెలంగాణ నేపథ్యంలో ఇంత వరకూ చూడని ప్రేమకథ ఇదని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి రచన: రసూల్, సంగీతం: మణిశర్మ, కెమెరా: పవన్, నిర్మాణం: ఎంబీ ప్రొడక్షన్స్.