ముంబై, ఆగస్టు 17: లాజిస్టిక్స్ అండ్ కమర్షియల్ రిఫ్రిజిరేషన్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.178.88 కోట్ల ఆదాయంపై రూ.1.65 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.111.50 కోట్ల ఆదాయంతో పోలిస్తే 60 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.
ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ చంద్రకాత్ పీ పటేల్ మాట్లాడుతూ.. జపాన్‌కు చెందిన గెలీలీ హోల్డింగ్స్ రూ.180 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు. ఈ నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకు, ప్లాంట్లను ఆధునీకరించడానికి వినియోగించనున్నట్టు చెప్పారు.