IND vs SL : పొట్టి సిరీస్‌లో శ్రీలంకను వైట్‌వాష్ చేసిన భారత జట్టు(Team India) వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. ఆతిథ్య జట్టును తక్కువ స్కోర్(230)కే కట్టడి చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత బౌలర్ల ధాటికి పవర్ ఆదిలోనే తడబడిన లంక ఓపెనర్ పథుమ్ నిశాంక(52) అర్ధ శతకంతో కోలుకుంది. స్టార్ ఆటగాళ్లంతా చేతులెత్తేసిన చోట యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే(67 నాటౌట్) తొలి హాఫ్ సెంచరీతో గర్జించాడు. దాంతో, ఆతిథ్య జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.
సొంతగడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన శ్రీలంక తొలి వన్డేలో మోస్తరు స్కోర్ చేసింది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టుకు సిరాజ్ షాకిస్తూ ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(1)ను వెనక్కి పంపాడు. 7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన లంకను ఓపెనర్ పథుమ్ నిశాంక(52), కుశాల్ మెండిస్(14) ఆదుకునే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు 39 రన్స్ జత చేసిన ఈ జోడీని శివం దూబే విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన సదీర సమరవిక్రమ(8), కెప్టెన్ చరిత అసలంక(14)లు నిరాశపరిచారు.
పథుమ్ నిశాంక(52)
ఓ వైపు వికెట్లు పడుతున్న నిశాంక అద్భత ఆర్థ శతకంతో జట్టును ఆదుకున్నాడు. 101 పరుగుల వద్ద అతడు ఔటయ్యాక యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే(67 నాటౌట్ : 65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. జనిత్ లియాంగె(20), వనిందు హసరంగ(24)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
బంతి టర్న్ అవుతుండడంతో స్వీప్ షాట్లతో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లను దీటుగా ఎదుర్కొన్న వెల్లలాగే వన్డేల్లో తొలి అర్ధ శతకం బాదాడు. అకిల ధనంజయ(17)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. జట్టు స్కోర్ 200 దాటించి పరువు కాపాడాడు. చివరి ఓవర్ దాకా వెల్లలాగే ధాటిగా ఆడడంలో లంక 230 పరుగులకు పరిమితమైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
Dunith Wellalage’s first fifty in internationals was full of skill and more importantly, crucial in Sri Lanka finishing at 230-8
Unlike the T20Is, the lower-middle order stepped up when the hosts were in a bother 🙌https://t.co/ffVr9GLGJP | #SLvIND pic.twitter.com/Z482wo5DGU
— ESPNcricinfo (@ESPNcricinfo) August 2, 2024