నిర్మల్ అర్బన్, జనవరి 6 : సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రె స్ సర్కారుపై తిరుగుబాటు చేసి యేడాది పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించి, రెగ్యులర్ చేస్తామని 2023 న వంబర్ 18న సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చాడు. అధి కారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది డిసెంబర్ 31 వరకు నిర్మల్ జిల్లాలో 659 మంది కాం ట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా 30 రోజులపాటు నిరవధిక సమ్మె కు దిగా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమగ్ర శిక్ష ఉద్యో గులు సమ్మె చేయడంతో అప్పట్లో వివిధ కార్యాలయాల్లో పనులు నిలిచాయి. యూఆర్ఎస్, కేజీబీవీ పాఠశాల, కళాశా లల్లో విద్యా బోధన నిలిచింది.
ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చడంలో ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల ను మోసం చేసింది. 30 రోజులుగా నిరవధికంగా సమ్మె చేయడంతో సమ్మె విరమిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి న ప్రభుత్వం ఏడాది గడుస్తున్న పరిష్కారం కా లేదు. కనీసం సమ్మె కాలపు వేతనాన్ని మంజూ రు చేస్తామన్న ప్రభుత్వం ఆ వేతనాన్ని మంజూ రు చేయకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వం ఇచ్చి న హామీని వెంటనే అమలు చేసి ఉద్యోగ, ఉపా ధ్యాయులకు న్యాయం చేయాలి.
– గంగాధర్, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, నిర్మల్ జిల్లా