Forex Reserves | ఫారెక్స్ రిజర్వు (Forex Reserves) నిధులు మళ్లీ పడిపోయాయి. జూలై 26తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిధులు 3.471 బిలియన్ డాలర్లు పడిపోయి 667.386 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని శుక్రవారం ఆర్బీఐ ఓ ప్రకటనో తెలిపింది. అంతకు ముందు వారం జూలై 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు జీవిత కాల గరిష్ట స్థాయి 670.857 బిలియన్ డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో కీలకమైన జూలై 26తో ముగిసిన వారానికి ఫారిన్ కరెన్సీ అసెట్స్ 1.171 బిలియన్ డాలర్లు పతనమై 586.877 బిలియన్ డాలర్లకు చేరాయి. గోల్డ్ రిజర్వు నిధులు సైతం 2.297 బిలియన్ డాలర్లు పతనమై 57.695 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) ఐదు మిలియన్ డాలర్లు పడిపోయి 18.202 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ రిజర్వు నిల్వలు మాత్రం 2 మిలియన్ డాలర్లు పుంజుకుని 4.612 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి.
ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్‌లో కొత్త రికార్డు.. 7.28 కోట్లు దాటిన ఐటీఆర్స్..!
Stocks | ఆటో.. ఐటీ స్టాక్స్ పతనంతో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు .. !
UPI Payments | వరుసగా మూడో నెలలోనూ అదే రికార్డు.. జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన యూపీఐ పేమెంట్స్..!
Bank of England | 5శాతం వడ్డీరేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్.. 16 ఏండ్ల గరిష్టం నుంచి కోత..!