Paris Olympics | పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా జరుగుతున్న స్విమ్మింగ్ ఈవెంట్స్‌లో స్లోవేకియాకు చెందిన స్విమ్మర్ టమర పొటొక తాను బరిలో నిలిచిన పూల్‌లోనే కుప్పకూలిపోయింది. మహిళల 200 మీటర్ల వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్‌ను ఆమె ఏడో స్థానంతో ముగించింది. అయితే హీట్ అయిపోయిన వెంటనే ఆమె అస్వస్థతతో అక్కడికక్కడే పూల్‌లో కుప్పకూలిపోయింది. దీంతో అక్కడే ఉన్న వైద్య సిబ్బంది హుటాహుటిన వచ్చి ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు.
21 ఏండ్ల పొటొక.. మూడో హీట్‌లో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత అక్కడే ఉన్న తన కోచ్, ఇతరులకు నవ్వుతూ అభివాదం చేసింది. కానీ అకస్మాత్తుగా ఆమె పూల్‌లో ఉన్న ఇనుపకడ్డీని పట్టుకుని నీటిలోకే మునుగుతుండగా వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి ఆమెను నీటి నుంచి బయటకు తీసి వైద్య సహాయం నిమిత్తం తరలించారు. పొటొకకు గుండె నొప్పి కారణంగా అలా హఠాత్తుగా పడిపోయిందా? అన్న విషయంపై స్పష్టత లేదు.
#Slovak swimmer #TamaraPotocká is under medical evaluation after collapsing, possibly due to her heartbeat stopping briefly, following her Women’s 200m Individual Medley heat at the 2024 #Paris2024 #Olympics.#Swimming #Esha #ManuBhaker #TamaraPotocka pic.twitter.com/lb9x67gCut
— know the Unknown (@imurpartha) August 2, 2024
తనతో పాటే పోటీలో ఉన్న ఇజ్రాయెల్ స్విమ్మర్ లియా పోలోన్స్కి ఇదే విషయమై స్పందిస్తూ.. ‘ఈ క్రీడలోనూ రిస్క్‌లు ఉంటాయి. ఆటలో ఇలాంటిది జరుగుతుందని స్విమ్మర్లకు తెలుసు. రేసులోకి దిగినప్పుడు దీని గురించి ఎవరూ ఆలోచించరు. కానీ రిస్క్ మాత్రం ఎల్లవేళలా ఉంటుంది..’ అని తెలిపింది. పొటొకాకు ఇదే తొలి ఒలింపిక్స్ కాగా జాతీయ స్థాయిలో ఆమె అద్భుత ప్రదర్శనలతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
Athlete taken off on backboard and apparently getting oxygen. pic.twitter.com/reFmN7kM4J
— Pat Forde (@ByPatForde) August 2, 2024