Sobhita Dhulipala |దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో ఒక పవర్ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ అక్కినేని కోడలు నటించిన తాజా చిత్రం ‘చీకటిలో’. ఈ సినిమాకు శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా.. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రం రాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నేరుగా ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది చిత్రబృందం. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
before the night creeps in, Sandhya arrives 🌇 brace for an impact 😨#CheekatiloOnPrime, Jan 23#SobhitaDhulipala #VishwadevRachakonda @99_chaitu @sharandirects @sricharanpakala @mallikarjundp @sbdaggubati @sureshprodns @rama_balaji @xoxolipika pic.twitter.com/actU8p00Qe
— prime video IN (@PrimeVideoIN) January 8, 2026